Advertisement
Google Ads BL

నయన్ నువ్ గ్రేట్


నయనతార లేడీ సూపర్ స్టార గా గత ఏడాదిని కెరీర్ పరంగానే కాకుండా పర్సనల్ లైఫ్ లోను బెస్ట్ ఇయర్ గా మార్చుకుంది. విగ్నేష్ శివన్ తో ఏడేళ్ల ప్రేమ బంధాన్ని వివాహంతో ముడివేసుకున్న నయనతార ఇద్దరి కవల పిల్లలకి తల్లయ్యింది. సరోగసి పేరెంట్స్ గా వివాదాలు ఎదుర్కున్న నయనతార-విగ్నేష్ శివన్ తర్వాత కూల్ గా సమస్యని పరిష్కరించారు. కొత్త ఏడాది భర్త పిల్లలతో అపురూపంగా గడిపిన క్షణాలను సోషల్ మీడియాలో షేర్ చేసిన నయనతార తన మంచి మనసుని చాటుకుంది.

Advertisement
CJ Advs

ఈమధ్యనే నయనతార అత్తగారు తన కోడలు బంగారం, ఆమె మనసు మంచిది, తన ఇంట్లో పని చేసే వారిలో ఒకరికి ఎనిమిది లక్షల అప్పు ఉంటే దానిని నయనతార తీర్చేసింది అంటూ చెప్పిన కొద్దిరోజులకే నయనతార మరో మంచి పని చేసింది. అది న్యూ ఇయర్ రోజున నయనతార భర్త విగ్నేష్ శివన్ తో కలిసి చెన్నై రైల్వే స్టేషన్ కి కారు వేసుకుని వెళ్లి అక్కడి స్ట్రీట్ చిల్డ్ర‌న్స్‌కు న్యూ ఇయ‌ర్ గిఫ్ట్స్ అందించారు. ఈ విషయం ఫొటోస్, వీడియోస్ రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అది చూసిన నెటిజెన్స్ నువ్ గ్రేట్ నయన్.. నువ్వూ.. నీ పిల్లలే సంతోషంగా ఉండకుండా.. స్ట్రీట్ పిల్లల గురించి ఆలోచించావ్ చూడు నీ పెద్ద మనసుకి ఫిదా అంటూ నయనతారని ఆమె భర్త విగ్నేష్ శివన్ ని పొగిడేస్తున్నారు.

Nayanthara, Vignesh Shivan hand out gifts to Street Children:

Nayanthara, Vignesh Shivan hand out gifts to underprivileged children
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs