Advertisement
Google Ads BL

వారసుడు: ప్రతి షాట్ ట్రోల్ చేస్తున్న నెటిజెన్స్


దిల్ రాజు భారీ బడ్జెట్ తో వంశి పైడిపల్లి కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో తెరకెక్కించిన వారసుడు సంక్రాంతికి చిరు-బాలయ్య సినిమాలపైకి పోటీకి దిగబోతుంది. వారసుడు ప్రమోషన్స్ లో దిల్ రాజు చాలా మాట్లాడుతున్నారు. విజయ్ గొప్ప అంటూ టాలీవుడ్ హీరోలని ఇన్సల్ట్ చేసినట్లుగా మాట్లాడడం స్టార్ హీరోల ఫాన్స్ తట్టుకోలేకపోతున్నారు. వారసుడు రిజల్ట్ పై దిల్ రాజు చాలా నమ్మకంగా ఉన్నారు. సంక్రాంతి సెంటిమెంట్ కలిసొస్తుంది అని నమ్ముతున్నారు. అటు చూస్తే వారసుడు ట్రైలర్ రిలీజ్ కాగానే.. వారసుడుపై ట్రోలింగ్ మొదలు పెట్టారు. వారసుడు ట్రైలర్ లోని ప్రతి షాట్ ని ట్రోల్ చేస్తున్నారు నెటిజెన్స్.

Advertisement
CJ Advs

వంశీ పైడిపల్లి మహేష్ చేసిన సినిమాల్లోని చాలా షాట్స్ ని కాపీ కొట్టి విజయ్ వారసుడిని తీసేశాడని.. విజయ్ వారసుడు ట్రైలర్ లో ఎంట్రీ ఇచ్చిన విధానం మహేష్ బ్రహ్మోత్సవంతో పోలుస్తుంటే.. విజయ్ కలర్స్ మధ్యన వేసిన డాన్స్ సాంగ్ ని శ్రీమంతుడుతో పోలుస్తున్నారు. రష్మిక-విజయ్ కలయికని మహేష్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తో పోలుస్తున్నారు. మహర్షి స్టయిల్లోనే విజయ్ ని వారసుడులో వంశీ చూపిస్తున్నాడంటున్నారు. అటు విలన్ ప్రకాష్ రాజ్ తో గొడవని ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో పోలుస్తున్నారు, అలాగే వారసుడు కథ రొటీన్ ఫార్ములాతోనే తెరకెక్కింది అంటూ విమర్శిస్తున్నారు.

ఓ విలన్ సీఈఓ సీట్ కోసం హీరోని ప్రోబ్లెంస్ లోకి నెట్టెయ్యడం, దాని కారణంగా అన్యోన్యంగా ఉన్న ఫ్యామిలీ విడిపోవడం ఇవన్నీ మహేష్ బ్రహ్మోత్సవంలోని సీన్స్ నే వంశీ కాపీ కొట్టాడంటున్నారు. వారసుడు ట్రైలర్ లోని ప్రతి షాట్ ని వేరే సినిమాలతో పోలిక పెడుతూ నెటిజెన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

Varasudu Trailer: Netizens trolling every shot:

Vijay Varasudu Trailer Public talk
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs