ప్రభాస్ చాలా మొహమాటస్తుడు, సిగ్గరి, బెరుకు ఉన్న స్టార్ హీరో. ఆయన పబ్లిక్ లో చాలా అరుదుగా కనిపిస్తారు. అలాగే తన ఫ్రెండ్స్, సన్నిహితులతో ప్రభాస్ ఎలా ఉంటారో కూడా ఎవరికీ తెలియదు. కానీ ప్రభాస్ లో మరో కోణాన్ని ఆహా అన్ స్టాపబుల్ లో బాలయ్య బయటపెట్టారు. ప్రభాస్ తన ఫ్రెండ్స్ తో ఎంతగా కలిసిపోయి మింగిల్ అవుతారో రామ్ చరణ్ ఫోన్ కాల్ లో చూపించగా, గోపీచంద్ తో కలిసి ఆహా స్టేజ్ పై తమ ఫ్రెండ్ షిప్ చూపించడమే కాదు.. ప్రభాస్ తన సన్నిహితుల దగ్గర ఎంతగా ఓపెన్ గా ఉంటారో.. బాలయ్య దగ్గర అంతే చనువుగా వున్నారు. బాలకృష్ణకు ట్విస్ట్ లు ఇస్తూ సర్ సర్ అంటూ ఆటపట్టించిన ఫస్ట్ ఎపిసోడ్ కి ఆహా ఓటిటి ప్లాట్ ఫామ్ క్రాష్ కూడా అయ్యింది.
ఇప్పుడు రాబోయే సెకండ్ ఎపిసోడ్ పై మరింతగా క్యూరియాసిటీ ఏర్పడింది. ఈ ఎపిసోడ్ లో ప్రభాస్ తన ఫ్రెండ్ హీరో గోపీచంద్ తో కలిసి సందడి చెయ్యబోతున్నారు. 2008 లో వర్షం సినిమాలో హీరోయిన్ త్రిష కోసం గొడవపడ్డారంటూ బాలయ్య ఇండైరెక్ట్ గా గోపీచంద్-ప్రభాస్ ని అడగ్గానే నేను కాదు సర్ వాడే అంటూ గోపీచంద్ మీద నెట్టేసిన ప్రభాస్ చాలా కామెడీగా కనిపించారు. తాజాగా వదిలిన ప్రోమోలో ప్రభాస్ కన్ను కొడుతూ నాలిక కరుచుకున్న సన్నివేశానికి ప్రభాస్ ఫాన్స్ హమ్మ ప్రభాస్ నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ మురిసిపోతున్నారు.
గోపీచంద్ తో ఏదైనా ఫుల్ గా చెప్పు సగం సగం చెప్పకు అని ప్రభాస్ అనగానే ఏంటి బెదిరిస్తున్నావ్, వార్నింగ్ లు ఇవ్వొద్దమ్మా అని అన్నారు బాలయ్య. మళ్ళీ ఏ అమ్మాయి అని ఎందుకడిగారు అని ప్రభాస్ మెలికలు తిరిగిపోతూ అడగ్గానే అబ్బా నాకే ట్విస్ట్ ఇస్తావా అన్నారు బాలయ్య.. దానికి ప్రభాస్ కన్నుకొట్టి నాలుక బయట పెట్టి చేసిన యాక్టింగ్ చూసి ప్రభాస్ లో మరో యాంగిల్ చూసారా అంటూ ఫాన్స్ ఫిదా అవుతున్నారు. బాలయ్య బాహుబలి తర్వాత ప్రాజెక్ట్ ల గురించి అడగ్గానే ప్రభాస్ తన మనసులోని మాట బయటపెట్టిన ప్రోమో వదిలింది ఆహా టీమ్.