నిన్నమొన్నటి వరకు సంక్రాంతి రిలీజ్ డేట్స్ విషయంలో దోబూచులాడిన మేకర్స్ ఫైనల్లీ రిలీజ్ డేట్స్ ని లాక్ చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ సీనియర్ హీరోలైన నందమూరి నట సింహ బాలకృష్ణ వీరసింహ రెడ్డిని జనవరి 12 న వర్డ్ వైడ్ గా రిలీజ్ చెయ్యబోతున్నారు. ఆ తర్వాతి రోజే మెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్యతో జనవరి 13 న దిగిపోతున్నారు. ఇది ఎప్పుడో మైత్రి మూవీస్ వారు డేట్స్ లాక్ చేసారు. ఇక తమిళం నుండి రాబోతున్న రెండు డబ్బింగ్ సినిమాలపై విపరీతమైన క్యూరియాసిటీ మొదలైంది.
కారణం తెలుగు సినిమాలపై డబ్బింగ్ సినిమాల రిలీజ్ విషయంలో దిల్ రాజుని చాలామంది కడిగిపారేశారు. విజయ్ తో వారసుడు తెరకెక్కించిన దిల్ రాజు.. ఇది కూడా తెలుగు సినిమానే అని చెబుతున్నాడు. అలాగే జనవరి 12 నే వారసుడిని దింపుతున్నాడు. అదే కోలీవుడ్ లో మరో స్టార్ హీరో అజిత్ కుమార్ కూడా తునివుతో ఫైట్ కి రెడీ అయ్యాడు. కోలీవుడ్ లో విజయ్ vs అజిత్, వారిసు vs తూనీవు అన్న రేంజ్ లో పొంగల్ ఫైట్ సెట్ అయ్యింది. కానీ అక్కడ కూడా విజయ్ వారిసుకి, అజిత్ తూనీవు కి అధికారికంగా రిలీజ్ డేట్ ఇవ్వలేదు. ఇంకా వారం రోజుల టైం మాత్రమే ఉంది.. ఇంకెప్పుడు డేట్స్ ప్రకటిస్తారనే అతృతతో ఫాన్స్ ఉన్నారు.
అయితే అజిత్ కుమార్ తూనీవు తెలుగులో తెగింపు టైటిల్ తో రిలీజ్ చేస్తుండగా.. ఇప్పుడు అజిత్ తునీవు వరల్డ్ వైడ్ గా ఈ నెల 11 అంటే వచ్చే బుధవారం రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. అంటే కేవలం వారం రోజుల ముందు తెగింపు రిలీజ్ అవుతున్నట్టుగా ప్రకటించారు. ఈమధ్యనే విడుదలైన అజిత్ తెగింపు ట్రైలర్ అందరిని ఆకట్టుకుంది. సో 11 న అజిత్ తెగింపు, 12 న బాలయ్య వీర సింహ రెడ్డి, విజయ్ వారసుడు, 13 న వాల్తేర్ వీరయ్యతో చిరు ఫాన్స్ కి కిక్ ఇవ్వబోతున్నారు.