Advertisement
Google Ads BL

తమన్నా-విజయ్ వర్మ రిలేషన్ నిజమే


మిల్కి బ్యూటీ  తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ లో ఉంది అని లోకం కోడై కూసినా తమన్నా మాత్రం ఈ విషయాన్ని కొట్టిపారేస్తూనే ఉంది. కానీ ఈ న్యూ ఇయర్ పార్టీలో తమన్నా బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో కలిసి గోవా వెళ్లి అక్కడ స్నేహితుల మధ్యన సెలెబ్రేషన్స్ చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగానే ఇప్పుడు మాట్లాడవే తమన్నా, ఇప్పుడు చెప్పు నీ బాయ్ ఫ్రెండ్ వ్యవహారం అంటూ మీడియా తమన్నా పై ఎదురు దాడికి దిగింది. కానీ మధ్యలో తమన్నా ఫాన్స్.. వాళ్ళ ఈమధ్యన ఉంది ఫ్రెండ్ షిప్, వాళ్ళ మధ్యన డేటింగ్ ఉంటే వాళ్లే చెబుతారుగా ఎందుకంత  కంగారు అంటూ తమన్నాకి సపోర్ట్ చేస్తున్నారు.

Advertisement
CJ Advs

అయితే తమన్నా మాత్రం విజయ్ వర్మతో డేటింగ్ విషయం కన్ ఫర్మ్ చెయ్యకపోయినా.. న్యూ ఇయర్ పార్టీకి గోవా వెళ్లి తిరిగి ముంబై కి చేరుకుంది.. అది కూడా విజయ్ వర్మతో కలిసి. ఇంకేముంది ఇండియా తమన్నా-విజయ్ వర్మలని కలిపి ఫొటోస్ తీస్తూ వెంటపడింది. తమన్నా-విజయ్ వర్మలు కెమెరాలకు చిక్కిన వీడియోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కలిసే వెళ్లి, కలిసే వచ్చిన తమన్నా-విజయ్ వర్మలు నోటితో తమ రిలేషన్ విషయం చెప్పకుండా ఇలా ఎయిర్ పోర్ట్ లో కలిసి కనబడి కన్ ఫర్మ్ చేసారు అంటూ నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.

మరి తమన్నా ఇప్పటికైనా తన సీక్రెట్ ఎఫ్ఫైర్ విషయంలో నిజం ఒప్పుకుంటుందో.. లేదంటే ఇంకొన్నాళ్ళు ఇలాగే వెయిట్ చేస్తుందో చూడాలి.

Tamannaah, Vijay Varma seen at Mumbai airport :

Tamannaah Bhatia, Vijay Varma clicked at airport amid dating roumour
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs