2022 పూజా హెగ్డే కి చాలా భారంగా గడిచిపోయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న రాధే శ్యామ్ పాన్ ఇండియా డిసాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత నీలాంబరిగా మెస్మర్టైజ్ చేద్దామనుకుంటే ఆచార్య అంతకన్నా బిగ్గెస్ట్ షాక్ ఇచ్చింది. స్టార్ హీరో విజయ్ తో కోలీవుడ్ లో జెండా పాతుదాం అనుకుంటే.. అది కూడా పూజ హెగ్డే కి దిమ్మతిరిగే షాకిచ్చింది. అయినా పర్లేదు బాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ రోహిత్ శెట్టి, హీరో రన్వీర్ సింగ్ తో కలిసి సర్కస్ తో టాప్ లేపుదామనుకుంటే.. ఆ సినిమా మరింత ఘోరమైన రిజల్ట్ పూజా హెగ్డే కి కట్టబెట్టింది.
అలా 2022 లో పూజా హెగ్డే కి అదృష్టం కలిసి రాలేదు, అంతేకాకుండా కాలుకి ఫ్రాక్చర్ అవడంతో పూజ కొద్దిరోజులు బెడ్ మీదే ఉంది. ఇక ఈ ఏడాది పూజా హెగ్డే మహేష్ తో చెయ్యబోయే SSMB28 అలాగే బాలీవుడ్ సల్మాన్ ఖాన్ తో చేసే మూవీపై ఆశలు పెట్టుకుంది. న్యూ ఇయర్ రోజు గ్రాండ్ గా పార్టీ చేసుకున్న పూజా హెగ్డే కొత్త లుక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. బుట్టబొమ్మ పూజా హెగ్డే పొందికగా డ్రెస్ వేసుకుని.. నార్మల్ లుక్ లోనే కనిపించినా ఆమె అందానికి యూత్ అంతా మైమరిచిపోతుంది. పూజ కొత్త లుక్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, లైక్స్ కొడుతూ ఫాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు.