Advertisement
Google Ads BL

మరోసారి చెయ్యను: శృతి హాసన్


ప్రస్తుతం టాలీవుడ్ లో శృతి హాసన్ హవా కొనసాగుతుంది. టాప్ హీరోయిన్స్ అందరూ తమ సినిమాల విషయంలో సైలెంట్ అవ్వగా.. శృతి హాసన్ జోరు మాములుగా లేదు. తెలుగులో ఒకేసారి ఇద్దరి సీనియర్ హీరోలతో నటించిన రెండు సినిమాలు ఒక్క రోజు గ్యాప్ తో బాక్సాఫీసు ఫైట్ కి దిగడంతో శృతి హాసన్ హాట్ టాపిక్ గా మారింది. బాలయ్య-చిరులతో చిందులేస్తూ శృతి హాసన్ అటు ప్రమోషన్స్ తోనూ వేడెక్కిస్తుంది. అయితే వాల్తేర్ వీరయ్యలో నేను చిరంజీవి-నువ్వు శ్రీదేవితో సాంగ్ కోసం మైనస్ డిగ్రీల మంచు, చలిలో చేసిన సాంగ్ గురించి మట్లాడుతూ ఇలాంటి సాంగ్స్ మరొక్కసారి చెయ్యను అని చెబుతుంది. 

Advertisement
CJ Advs

ఎందుకంటే అమ్మాయిలు అంత చలి, మంచు పడేటప్పుడు సారీస్ లో చాలా ఇబ్బంది పడతారు. నాకు పాట ఎంతో నచ్చింది, ప్రస్తుతం ఆడియన్స్ కూడా ఇదే కోరుకుంటున్నారు. ఇలాంటి సాంగ్స్ చూడాలనుకుంటున్నారు. అందుకే కష్టపడి అంత మంచులో ఈ సాంగ్ చేసాము, కానీ మహిళలకి మాత్రం ఇలాంటివి చెయ్యడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఇక సంక్రాంతికి ఒకేసారి వీరసింహ రెడ్డి-వాల్తేర్ వీరయ్య రెండు సినిమాలు విడుదల అవడం పట్ల ఆనందంగా ఉంది. 

ఇద్దరి పెద్ద హీరోలతో ఒకేసారి సినిమాలు చెయ్యడం నాకు నచ్చింది, అలాగే రిజల్ట్ విషయంలో భయం లేదు. కష్టపడి పని చేసాం, మంచి రిజల్ట్ వస్తుందని ఆశిస్తున్నాం అంటూ శృతి హాసన్ వాల్తేర్ వీరయ్య సాంగ్ షూట్ అనుభవాలని ప్రమోషన్స్ లో రివీల్ చేసింది.

Shruti Haasan says shooting for a song from Waltair Veerayya:

Shruti Haasan says shooting for a song from Waltair Veerayya was physically so uncomfortable
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs