Advertisement
Google Ads BL

త్వరలోనే యాంకర్ శ్రీముఖి పెళ్లి?


బుల్లితెర మీద తన గళంతోనే భయపెట్టేసే శ్రీముఖి ఇప్పుడు గ్లామర్ తో చమటలు పట్టిస్తుంది. బబ్లీగా ఉన్నప్పుడు పద్దతిగా కనబడిన శ్రీముఖి ఇప్పుడు బాగా సన్నగా నాజూగ్గా మారిపోయింది. బరువు తగ్గించి గ్లామర్ పెంచేసింది. బుల్లితెర షోస్ తో మిగతా యాంకర్స్ కి గుండెల్లో దడ పుట్టిస్తున్న శ్రీముఖి.. తరచూ వెకేషన్స్ అంటేనే గోవా, గోవా అంటే వెకేషన్స్ అంటూ ఫ్లైట్ ఎక్కేస్తుంది. ఇక శ్రీముఖి ప్రస్తుతం స్టార్ మా, ఈటివి, జెమిని, జీ ఛానల్ ఇలా ఏ ఛానల్ ని వదలడం లేదు. 

Advertisement
CJ Advs

రీసెంట్ గా కొత్తిల్లు కొని గృహప్రవేశం చేసిన శ్రీముఖి ప్రేమలో ఉంది, పెద్దల అంగీకారంతో ఓ బిజినెస్ మ్యాన్ ని వివాహం చేసుకోబోతుంది అంటూ ఎప్పటినుండో ప్రచారం జరిగే న్యూస్ కి ఇప్పుడు మరోసారి రెక్కలొచ్చాయి. రెండు రోజులుగా సోషల్ మీడియా మొత్తం యాంకర్ శ్రీముఖి పెళ్లి కబుర్లే. శ్రీముఖి బిజినెస్ మేన్ తో జీవితాన్ని పంచుకోబోతోందని ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న పాత న్యూస్. ఇప్పటికే ఇరువురి కుటుంబాలు వివాహం గురించి మాట్లాడుకున్నాయని.. ఆ బిజినెస్ మ్యాన్ తో శ్రీముఖి పెళ్ళికి ముహూర్తాన్ని ఫిక్స్ చేయడమే మిగిలిందని కొత్తగా వినిపిస్తున్నారు. 

శ్రీముఖి పెళ్లి కోసమే బరువు తగ్గి నాజూగ్గా మారిపోయింది అని, పెళ్లి తర్వాత కూడా ఆమె యధావిధిగా యాంకరింగ్ చేస్తుంది అంటూ ఏవేవో కథనాలు ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి.

Sreemukhi Going To Marry a Businessman:

Bigg Boss Fame Sreemukhi Going to Marry a Business man 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs