Advertisement
Google Ads BL

సమంతపై రష్మిక ప్రేమ


సమంత-రష్మిక కలిసి నటించిన సందర్భాలు లేవు. అసలు వాళ్లిద్దరూ స్నేహితులు అన్న విషయం ఎక్కడ ఎక్స్ పోజ్ అవ్వలేదు. పుష్ప లో రష్మిక హీరోయిన్, అదే సినిమాలో సమంత ఐటమ్ సాంగ్ లో ఆడిపాడింది. ఇద్దరూ కలిసే ఛాన్స్ లేదు. కానీ ఇప్పుడు రష్మిక మాత్రం సమంతపై తెగ ప్రేమ ఒలకబోస్తుంది. రీసెంట్ గా రష్మిక మందన్న నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో  సమంతకి అమ్మవుతాను, ఆమెని గుండెల్లో పెట్టి చూసుకుంటాను అంటూ సంచలన వ్యాఖ్యలు చెయ్యడం అందరికి విచిత్రంగా అనిపించింది.

Advertisement
CJ Advs

సమంత అందమైనదే కాదు, అంతకుమించిన దయాగుణం ఉన్న వ్యక్తి, ఆమె ఒక అద్భుతమైన స్త్రీ మూర్తి అంటూ రష్మిక సమంత పై తన ప్రేమని కురిపించింది. అయితే సమంతకు మాయోసైటిస్ అనే వ్యాధి ఉన్న విషయం ఆమె సోషల్ మీడియాలో ప్రకటించిన తర్వాతే తెలిసింది. మేము ఎప్పుడు కలిసినా మా మధ్యన మాయోసైటిస్ గురించి ప్రస్తావన రాలేదు. ఇలాంటి సమయంలో సమంతని ఓ అమ్మలా మారి కాపాడుకోవాలనుకుంటున్నాను, ఆమె వెంటే ఉండి.. ఆమెకి తోడుగా నిలవాలనుకుంటున్నాను.

సమంత లైఫ్ లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి నుండి నేను స్ఫూర్తి పొందుతాను, తనకి ఎంతో ఇష్టమైన సమంత కి ఇకపై అన్నిటిలో మంచే జరగాలని కోరుకుంటున్నాను అంటూ రష్మిక సమంతపై ఆ ఇంటర్వ్యూలో తన ప్రేమని చూపించింది.

Rashmika Is A Possessive Mama For Samantha ...:

Rashmika Says She Extremely Possessive of Samantha, Reacts To Her Myositis Diagnosis
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs