Advertisement
Google Ads BL

నెటిజెన్స్ ట్రోల్స్ పై శృతి హాసన్ ఫైర్


టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ హీరోయిన్స్ అందరూ సైలెంట్ అవ్వగా.. శృతి హాసన్ హవానే కనబడుతుంది. క్రాక్ తో రీ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న శృతి హాసన్.. తర్వాత వకీల్ సాబ్ లో గెస్ట్ రోల్ లో మెరిసింది. క్రాక్ హిట్ తో శృతి హాసన్ కి సలార్ లాంటి బిగ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో ఆఫర్ వచ్చింది. ప్రభాస్ తో మొదటిసారి శృతి హాసన్ జోడి కడుతుంది. ఈ సినిమాకి అవకాశం వచ్చిందో.. లేదో టాలీవుడ్ సీనియర్ హీరోలైన చిరు-బాలయ్య లతో బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు దక్కించుకుంది. అయితే ఆమె ఈ రెండు ప్రాజెక్ట్ లని ఓకె చెయ్యగానే సీనియర్ హీరోలతో శృతి హాసన్ నటించడం ఏమిటి... ఆమెకి అవకాశాలు రాకె ఇలా సీనియర్ హీరోలకి కనెక్ట్ అయ్యింది అనే కామెంట్స్ వినిపించాయి.

Advertisement
CJ Advs

ఇప్పుడు మెగాస్టార్ చిరు తో చేసిన వాల్తేర్ వీరయ్య అలాగే బాలకృష్ణ తో చేసిన వీర సింహ రెడ్డి ఈ రెండు సినిమాలు సంక్రాంతికి పోటీ పడుతున్నాయి. అలా శృతి హాసన్ తనతో తానే పోటీ పడుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ సమయంలో శృతి హాసన్ తండ్రి వయసున్న హీరోలతో నటిస్తున్నావ్, నీకు అవకాశాలు రకా.. లేదంటే డబ్బు కోసమే ఇలా పెద్ద హీరోలతో సినిమాలు ఒప్పుకున్నావా అంటూ నెటిజెన్స్ శృతి హాసన్ ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. కమల్ వయసున్న హీరోలైన చిరు-బాలయ్యలతో ఎందుకు నటించావ్ అంటూ దాదాపుగా నిలదీస్తున్నారు.

అయితే ఈ ట్రోలింగ్ పై శృతి హాసన్ ఘట్టుగానే రిప్లై ఇచ్చింది. సినిమా ఇండస్ట్రీలో వయసు అనేది జస్ట్ నెంబర్ మాత్రమే అని, ప్రతిభ ఉంటే మరణించేవరకు నటించవచ్చు అన్నారు. నేను మాత్రమే కాదు ఇంతకుముందు చాలామంది హీరోలు తమ వయసులో సగం ఉన్న హీరోలతో రొమాన్స్ చేసారు. దానికి నేను అతీతం కాదు అంటూ శృతి హాసన్ ట్రోలర్స్ పై ఫైర్ అయ్యింది.

Shruti Haasan fires on netizens trolls:

Why act with senior heroes? – Actionable response by Shruti Haasan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs