Advertisement
Google Ads BL

తమన్నా లవ్ సీక్రెట్ రివీల్డ్


తమన్నా పెళ్లి చేసుకోబోతుంది. బాలీవుడ్ నటుడితో డేటింగ్ లో ఉంది అంటే కస్సుమని లేచి.. నాకు పెళ్లా. ముందు కెరీర్ తర్వాత పెళ్లి, అయినా పెళ్లిని అందరికి చెప్పే చేసుకుంటాను, సీక్రెట్ గా చేసుకోను అంటూ ఎగిరిపడిపోయే తమన్నా ఇప్పుడు కాదు ఎప్పటినుండో ప్రేమలో మునిగితేలుతోంది అనే సీక్రెట్ తాజాగా బయటపడిపోయింది. న్యూ ఇయర్ రోజున రూమర్ ప్రేమికుడితో కలిసి తమన్నా మీడియాకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. తెలుగులో హీరో నాని MCA మూవీలో విలన్ గా నటించిన హిందీ నటుడు విజయ్ వర్మతో తమన్నా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది.. అన్న విషయం పబ్లిక్ గా బయటపడింది.

Advertisement
CJ Advs

ఎప్పటినుండో డేటింగ్ లో ఉన్నా.. అవి రూమర్స్ అంటూ కొట్టిపారేసిన తమన్నా ఇప్పుడేం చెబుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే న్యూ ఇయర్ వేడుకల్లో తమన్నా, విజయ్ వర్మలు కలిసి వెకేషన్స్ ని ఎంజాయ్ చేస్తున్న వీడియో లో.. విజయ్ వర్మ వైట్ షర్ట్ వేసుకుని తమన్నా మాత్రం పింక్ డ్రెస్ లో మెరిసిపోయింది. గోవాలో జరిగిన పార్టీలో ఓ మూలన వీరిద్దరూ కిస్ పెట్టుకుంటున్న విషయం ఆ వీడియోలో బయటపడింది.

మరి పెళ్లి వార్తలు, డేటింగ్ రూమర్స్ పై కస్సుమనే తమన్నాకి ఈ వీడియో చూపిస్తే ఏమంటుందో.. మళ్ళీ కొట్టిపారేస్తుందో.. లేదంటే కామ్ గా ఉండిపోతుందో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Milky Beauty Caught Kissing Nani Villain:

Tamannaah - Vijay Varma The New Love birds ?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs