ప్రస్తుతం తెలుగులో బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో ప్రకంపనలు సృష్టిస్తుంది. సీజన్ 2 లో ప్రభాస్ ఎపిసోడ్ కి ఆహా సైట్ నే క్రాష్ చేసేలా అంచనాలు పెంచారు. రాబోతున్న పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ పై మరింత అంచనాలు పెరిగేలా చేసారు. ప్రభాస్, పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు టాక్ షోలకి రావడం చాలా అరుదు. అందుకే వారు బాలయ్య టాక్ షోకి హాజరవుతున్నారనగానే అందరిలో భీభత్సమైన క్యూరియాసిటీ మొదలయ్యింది. అలా ఆహా ని క్రాష్ చేసేవరకు అభిమానులు నిద్రపోలేదు. ప్రభాస్ ఎపిసోడ్ ఒకటి టెలికాస్ట్ అవ్వగా, రెండో ఎపిసోడ్ కోసం ఫాన్స్ వెయిటింగ్.
ఇంత క్రేజ్ ఉన్న అన్ స్టాపబుల్ టాక్ కి ఆహ్వానం వచ్చింది, అయినా నేను వెళ్ళను అంటూ మంత్రి రోజా బాలయ్య, అలాగే అన్ స్టాపబుల్ టాక్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. తనని టిడిపి వాళ్ళు చాలా అవమానించారని, ఇప్పుడు జనసేన కూడా తోడై తనపై ట్రోల్స్ చేస్తున్నారు, అయినప్పటికీ అన్ స్టాపబుల్ టాక్ షోకి ఆహ్వానము అందింది కానీ.. నేను వెళ్ళను. ఆ షో ద్వారా చంద్రబాబు, బాలకృష్ణ లు ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడవం తప్పులేదు అని నిరూపించాలని చూసారు, సీనియర్ ఎన్టీఆర్ అంటే సినీ కళాకారులకి దేవుడితో సమానం, అలాంటి వ్యక్తి అధికారాన్ని కూలదోసి, కూతురు భవిష్యత్తు కోసం బాలకృష్ణ తన బావ చంద్రబాబుతో ఆడిన నాటకాలు నచ్ఛలేదు అంది రోజా.
ఆస్తులు, నటనను పంచి ఇచ్చిన తండ్రిపై ఇలాంటి ఆరోపణలు చెయ్యడం కరెక్ట్ కాదు, చంద్రబాబు తప్పుచేయలేదని బాలకృష్ణ ప్రూవ్ చెయ్యాలని చూడడం దారుణం, అయినా బాలయ్యతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది, ఆయనతో నటించాను, కానీ నేను ఆ షోకి వెళితే పార్టీకి తప్పుడు సంకేతాలు వెళతాయి. షోకి వెళితే పార్టీకి నష్టం కలుగుతుందని నేను ఆ షోకు రానని చెప్పాను. నేనే ఆ షోకు వెళ్తే పార్టీకి రాంగ్ మెసేజ్ వెళ్తుందని అన్ స్టాపబుల్ కి ఆహ్వానం వచ్చినా వెళ్ళలేదు అంటూ బాలయ్య అన్ స్టాపబుల్ షోపై రోజా చేసిన కామెంట్స్ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.