Advertisement
Google Ads BL

హీరోయిన్ నేహా భర్తపై డ్రగ్స్ కేసు


డిసెంబర్ 31 నైట్ మద్యం అమ్మకాలకన్నా జోరుగా డ్రగ్స్ అమ్మకాలు ఎక్కువయ్యాయి. న్యూ ఇయర్ పార్టీలలోనే కాదు, ఇప్పుడు ప్రముఖ పబ్బుల్లోనూ ఈ డ్రగ్స్ కల్చర్ మొదలయ్యింది. స్కూల్స్, కాలేజెస్ ఇలా ఎక్కడ చూసినా డ్రగ్స్ చాకోలెట్స్ లా విచ్చలవిడిగా దొరుకుంది. గతంలో ఈ డ్రగ్స్ కేసులో సినిమా సెలబ్రిటీస్ మాత్రమే కాకుండా పలువురు ప్రముఖుల పలుమార్లు ఈడీ విచారణని ఎదుర్కొన్నవారే. అయినప్పటికీ.. ఈ డ్రగ్స్ ని కంట్రోల్ చేయలేకపోతున్నారు టాస్క్ ఫోర్స్, తాజాగా ఈ న్యూ ఇయర్ వేడుకల్లో ఓ హీరోయిన్ ఆమె భర్త కలిసి ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేశారనే విషయం వెలుగులోకి వచ్చింది.

Advertisement
CJ Advs

ఈ మధ్యనే హైదరాబాద్ లోని ఓ పబ్ లో మాజీ మంత్రి సమీప బంధువు డగ్స్ తీసుకుంటుండగా పోలీసులకు రెడ్ హ్యెండెడ్ గా పట్టుబడడంతో ఈ కేసులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తుంది. బంజారా హిల్స్ లోని ఓ పబ్ లో మాజీ మంత్రి బంధువు కృష్ణ కిషోర్ ని డ్రగ్స్ తీసుకుంటూ ఉండగా పోలీసులు రైడ్ చేసి పట్టుకున్నారు. అతడితో పాటు ఇంటర్నేషనల్ డీజే ఈవెంట్ మేనేజర్, హీరోయిన్ నేహా దేశ్ పాండే భర్త మైరాన్ మోహిత్ ను కూడా అరెస్ట్ చేసారు. మోహిత్ గోవాతో పాటు సన్ బర్న్ పొగ్రాంలను ఏర్పాటు చేస్తూ.. తన దగ్గర వందమంది డీజేలు ఉన్నట్లుగా గుర్తించారు.

మోహిత్ తో పాటుగా కిషోర్ రెడ్డి హైదరాబాద్‌ నగరంలోని పలు పబ్‌ లకు, అలాగే సినీ, వ్యాపారులకు బెంగుళూరు నుంచి డ్రగ్స్ తెప్పిస్తు డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నారు. హీరోయిన్ నేహా దేశ పాండే తెలుగులో కూడా కొన్ని చిత్రాల్లో నటించడంతో.. ఈ కేసుపై పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేపడుతున్నట్లుగా తెలుస్తుంది.

Neha Deshpande Husband Arrest:

Neha Deshpande Husband Arrested Over Drugs Case
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs