సమంత జీవితం ప్రస్తుతం హ్యాపీ గా లేదు అనేది సమంత వ్యాధి డిసైడ్ చేసేసింది. ఎప్పుడూ యాక్టీవ్ గా జిమ్ లో షూటింగ్స్ లో గడిపే సమంత ఇప్పుడు కామ్ గా ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. కారణం ఆమె శరీరం ఆమెకి ఇంకా పరిపూర్ణంగా సహకరించకపోవడమే. మాయోసైటిస్ వలన సమంత ఇంకా ఇంకా ప్రాబ్లెమ్ లోనే ఉంది. కోలుకుంటుంది అని చెబుతున్నా ఆమె నుండి అలాంటి సంకేతాలు అభిమానులకి అందడం లేదు. దానితో వాళ్ళు కాస్త డిస్పాయింట్ అవుతున్నారు. తాజాగా సమంత పాన్ ఇండియా మూవీ శాకుంతలం రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది.
అయితే సోషల్ మీడియాలో సమంత తో చిట్ చాట్ చేసిన ఫాన్స్.. శాకుంతలం ఎలా ఉండబోతుంది, ఎందుకు ఈ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నారని అడిగితే.. దానికి మీరే చూస్తారుగా అని చెప్పింది. సామ్ మీ లైఫ్ ఎలా ఉంది అని అడిగితే.. చాలా డిఫరెంట్ గా ఉంది అని కొత్తగా సమాధానం చెప్పింది. మీ ఆరోగ్యం బావుండాలి, మీరు మళ్ళీ బాక్సాఫీసు హిట్ కొట్టాలి, ఆరోగ్యంగా తిరిగిరావాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను, మీపై వచ్చే విమర్శలని తిప్పి కొట్టాలని మరో అభిమాని అనగా.. నా కోసం దేవుడిని ప్రార్దిస్తున్న మీకు నా ధన్యవాదాలు, నాపై విమర్శలా.. ఏమి విమర్శలు అంటూ ఫన్నీగా అడిగింది.
ప్రస్తుతం సమంత మాయోసైటిస్ కోలుకుంటుంది అని, ఆమె సంక్రాంతి తర్వాత ఖుషి షూటింగ్ లోను, సమ్మర్ లో బాలీవుడ్ మూవీ షూటింగ్ లో పాల్గొంటుంది అని ఆమె మేనేజర్ గతంలోనే చెప్పాడు.