యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కలయికలో పాన్ ఇండియా మూవీగా రెగ్యులర్ షూటింగ్ కి తయారవుతున్న NTR30 నుండి అప్ డేట్స్ చూసిన ఎన్టీఆర్ ఫాన్స్ ఆనందానికి అవధులే లేవు. ఫిబ్రవరిలో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టి వచ్చే ఏడాది ఏప్రిల్ 5న NTR30 రిలీజ్ అని గట్టిగా అనౌన్స్ చెయ్యడంతో ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. మాస్ గా కాదు ఊరమాస్ గా ఎన్టీఆర్ NTR30 లో కనిపించబోతున్నట్లుగా పోస్టర్ మీద పోస్టర్ తో కన్ ఫర్మ్ చేస్తున్నారు మేకర్స్. మరి ఈ మాస్ పాత్రకి తగిలే ఆ క్లాస్ హీరోయిన్ పై అందరిలో ఉత్సుకత పెరిగిపోతుంది.
అలియా భట్ అయితే ఎన్టీఆర్ సరసన అద్దిరిపోయేది. కానీ ఆమె హ్యాండ్ ఇచ్చింది. కియారా అద్వానీ దొరుకుతుంది అని ఎన్టీఆర్ ఆశపడ్డాడు. ఇప్పుడు కియారా అద్వానీ డేట్స్ అందుబాటులో లేకపోవడంతో.. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ని ఎన్టీఆర్ సరసన NTR30 లో ఫిక్స్ చేయబోతున్నారనే న్యూస్ మొదలయ్యింది. జాన్వీ కపూర్ కూడా ఈమధ్యన పదే పదే సౌత్ ఎంట్రీ పై మాట్లాడుతుంది. కొంతమంది ఫాన్స్ జాన్వీ కపూర్ విషయంలో టెన్షన్ పడుతుంటే.. ఇంకొంతమంది మాత్రం ఎన్టీఆర్ పక్కన జాన్వీ అయితే కొత్తగా ఉండి కళ వస్తుంది అని అంటున్నారు.
మరి NTR30 షూటింగ్ మొదలయ్యేలోపులోనే.. ఈ హీరోయిన్స్ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తుంది.