Advertisement
Google Ads BL

రష్మిక vs రిషబ్ మరొక్కసారి


రశ్మికపై రిషబ్ శెట్టి, అలాగే కిర్రాక్ పార్టీ హీరో రక్షిత్ శెట్టి ఎంత గుర్రుగా ఉన్నారో రీసెంట్ గా కిర్రాక్ పార్టీ ఆరేళ్ళ సెలెబ్రేషన్స్ ట్వీట్స్ లో చూసాం. కన్నడ ఇండస్ట్రీలోని ప్రముఖులతో కయ్యానికి కాలు దువ్విన రశ్మికపై అక్కడి ఇండస్ట్రీ జనాలు బ్యాన్ విధించే వరకు వెళ్లారు. కన్నడ ప్రేక్షకులు హేట్ చేసారు. కానీ ఇదంతా సద్దుమణిగేలా రష్మిక మాట్లాడినా.. రిషబ్ శెట్టి కానీ, రక్షిత్ కాని శాంతించలేదు. అందుకే సోషల్ మీడియాలో కిర్రాక్ పార్టీ సెలెబ్రేషన్స్ ట్వీట్ లో దర్శకుడు రిషబ్, హీరో రక్షిత్ ఇద్దరూ రశ్మికని టాగ్ చెయ్యకుండా తమ మధ్యన కోల్డ్ వార్ ఉంది అని చెప్పకనే చెప్పారు.

Advertisement
CJ Advs

మరి రష్మిక ఎందుకూరుకుంటుంది. ట్రోలర్స్ పైనే విరుచుకుపడే రష్మిక.. ఇప్పుడు రక్షిత్ అండ్ రిషబ్ కి టిట్ ఫర్ టాట్ అనేలా చేసింది. రష్మిక కూడా కిర్రాక్ పార్టీ సినిమా ఆరేళ్లను పూర్తిచేసుకోవడం పట్ల సంతోషంగా ట్వీట్ చేసింది, హీరోని కానీ .. డైరెక్టర్ ను గాని ట్యాగ్ చేయలేదు. దానితో రష్మిక vs రిషబ్ శెట్టి వివాదం సమసిపోలేదు, కోల్డ్ వార్ కింద ఇంకా ఇంకా రాజుకుంటూనే ఉంది అంటూ కన్నడ ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. 

Rashmika vs Rishab Shetty:

Rashmika Mandanna missing in Rishab Shetty Kirik Party celebrations
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs