Advertisement
Google Ads BL

సూపర్ స్టార్ తో నటించాలని ఉంది: త్రిష


పొన్నియన్ సెల్వన్ తర్వాత త్రిష కి పెద్ద స్టార్ల ఆఫర్స్ మొదలయ్యాయి. తెలుగులో కొన్నాళ్లుగా కనిపించని త్రిష మెగాస్టార్ ఆచార్యలో నటించాల్సి ఉంది.. కానీ ఆచార్య నుండి తప్పుకుని.. బయటికి వెళ్ళాక కోలీవుడ్ లో బిజీ అయిన త్రిష.. అక్కడ ఫుల్ ఫామ్ లో ఉంది. పొన్నియన్ సెల్వన్ తర్వాత త్రిష కి ఆఫర్స్ అలాగే డిమాండ్ కూడా ఎక్కువైంది. ఇప్పుడు స్టార్ హీరోలు విజయ్ అండ్ అజిత్ తో సినిమాలు చేసే అవకాశాలు త్రిషకి వచ్చాయనే టాక్ కూడా నడుస్తుంది. అలాగే తెలుగులోనూ బాలకృష్ణ-అనిల్ రావిపూడి చిత్రం కోసం త్రిషని సంప్రదిస్తున్నారనే న్యూస్ ఉంది.

Advertisement
CJ Advs

తాజాగా తమిళంలో త్రిష నటించిన రాంగి చిత్రం నిన్న శుక్రవారం విడుదలైన, త్రిష కీలక పాత్రలో లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో త్రిష పెరఫార్మెన్సు కి మంచి మార్కులే పడుతున్నాయి. రాంగి చిత్ర ప్రమోషన్స్ లోను త్రిష తన మార్క్ గ్లామర్ తో ఆకట్టుకుంది. కుందవై పాత్ర తనకి ఇచ్చిన మణిరత్నం గారికి థాంక్స్ చెప్పుకుంటాను, పొన్నియన్ సెల్వన్ చిత్రంలో నటించిన తనని అందరూ కుందవై పాత్రతోనే గుర్తుపెట్టుకుంటున్నారని అందుకే ఆయనకి థాంక్స్ చెప్పింది. ఇప్పటివరకు స్టార్ హీరోలందరితో కనిపించిన త్రిషకి సూపర్ స్టార్ రజినీకాంత్ తో ఫుల్ లెంత్ రోల్ చెయ్యాలనేది తనకోరిక అంటూ సూపర్ స్టార్ తో అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లుగా మనసులో మాట బయటపెట్టింది.

మరి రజినీకాంత్ తదుపరి సినిమాల్లో ఏమైనా త్రిషకి అవకాశం వస్తే అమ్మడు ఎగిరి గంతేస్తుందేమో కదా!

Trisha wants to act with Superstar :

Trisha Krishnan Wants To Act With Superstar Rajinikanth
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs