పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్న సమయంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ ని అపోజిట్ పార్టీ వారు అనరాని మాటలనడం అటుంచి.. వైసిపీ ప్రభుత్వంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ ఎక్కడ రాజకీయాల్లో పైకి ఎదిగిపోతాడో అని.. ఆయన మూడు పెళ్లిళ్లు అడ్డం పెట్టుకుని, అలాగే చంద్రబాబు నాయుడికి బిజెపికి దత్త పుత్రుడు అంటూ నీచమైన మాటలతో పవన్ ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అటు పవన్ కళ్యాణ్ కూడా వైసిపి మంత్రులని, నాయకులని ధీటుగా ఎదుర్కుంటూ వాయిస్ రేజ్ చేస్తున్నారు. అయితే తన తమ్ముడు ప్రజలకి సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చాడు.
సమాజానికి సేవచేయాలని తపన పడుతున్న పవన్ కళ్యాణ్ ని విమర్శించడం వరకు ఓకె.. కానీ కొంతమంది కావాలనే అతిగా మితిమీరి విమర్శిస్తున్నారని, అవి విన్నప్పుడు తట్టుకోవడం కష్టం ఉంటుంది అంటూ మెగా స్టార్ చిరంజీవి రీసెంట్ గా వాల్తేర్ వీరయ్య ప్రమోషనల్ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. రాజకీయంగా ఎన్ని గొడవలున్నా అది ఆరోగ్యదాయకంగా ఉండాలి కానీ.. ఇలా నోరు పారేసుకోకూడదు అనేది చిరు అభిప్రాయం. పవన్ నాకు సొంత బిడ్డ లాంటి వాడు. మా కుటుంబం అంటే వాడికి ఎంతో ప్రేమ. నిస్వార్ధంతో సేవ చెయ్యడానికి వెళ్ళాడు, డబ్బు వ్యామోహం లేదు, పదవి కావాలన్నా మోజు లేదు, నిజానికి మొన్నటివరకు పవన్ కి సొంత ఇల్లు కూడా లేదు.
ప్రజా సేవ కోసం వచ్చాడు. కానీ ఇక్కడ కొంతమంది వ్యక్తులు పవన్ ని పర్సనల్ గా టార్గేట్ చేస్తుంటే అది విన్నప్పుడు మనసు కి బాధగా ఉంటుంది. అయితే పవన్ ని విమర్శించిన వాళ్లతో మాట్లాడాల్సివచ్చినప్పుడు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది అంటూ చిరు ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.