కన్నడ బ్యూటీ రష్మిక ఇప్పుడు సౌత్ బ్యూటీగా మారిపోయింది. సౌత్ లో టాప్ హీరోయిన్ గా టాప్ స్టార్స్ తో సినిమాలు చేస్తూ బాలీవుడ్ లో తేలిన రశ్మికకి అక్కడి మేకర్స్ రెడ్ కార్పెట్ పరిచారు. అమితాబ్ తో కలిసి గుడ్ బై స్ట్రయిట్ హిందీ ఫిల్మ్ లో నటించిన రశ్మికకి ఆ సినిమా చిన్నపాటి షాక్ ఇచ్చింది. కానీ ఇప్పుడు మిషన్ మజ్ను కోసం గ్లామర్ గా రెచ్చిపోతూ సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ముంబై ని చుట్టేస్తోంది. ఈ న్యూ ఇయర్ కి గ్యాప్ తీసుకుని వెకేషన్ కి చెక్కేసింది.
Hello 2023… 🤍 రిలాక్సింగ్ మోడ్ లో ఉన్న రష్మిక పిక్ ని కూల్ గా షేర్ చేసింది. అయితే రష్మిక గత ఏడాది విజయ్ దేవరకొండ తో కలిసి గోవా లో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ చేసుకుంది. కానీ ఈసారి విజయ్ దేవరకొండ తో కలిసి న్యూ ఇయర్ ని సెలెబ్రేట్ చేసుకున్నట్టుగా కనిపించలేదు. అటు చూస్తే విజయ్ తాను స్విమ్మింగ్ పూల్ లో ఉన్న పిక్ ని షేర్ చేసాడు. అదే ప్రదేశంలో రష్మిక ఉన్న పిక్ ని చూసిన సినీ జనాలు వీళ్ళ మధ్యన ఏదో ఉంది అంటే నమ్మరే.. ఇది చూసి అయినా నమ్మండి అంటున్నారు.
ఇప్పుడు రష్మిక మాత్రం సింగిల్ గా ఉన్న పిక్ ని పోస్ట్ చేసి న్యూ ఇయర్ విషెస్ చెప్పింది. రష్మిక అలా కూల్ గా రిలాక్స్ గా పడుకుని బీచ్ ఒడ్డున సన్ రైజ్ ని ఎంజాయ్ చేస్తున్న పిక్ అది.