Advertisement
Google Ads BL

ఏజెంట్ లాక్ చెయ్యడానికి భయపడుతున్నాడు


అఖిల్ ఏజెంట్ విషయంలో ఏం జరుగుతుందో తెలియదు కానీ.. రిలీజ్ డేట్స్ ఇవ్వడం, తర్వాత డ్రాప్ అవ్వడం తరుచూ జరుగుతుంది. ఎప్పుడో ఆగష్టు లోనే రిలీజ్ అన్నారు, అది మారింది. తర్వాత గ్రాండ్ గా సంక్రాంతి రిలీజ్ అన్నారు కామ్ అయ్యారు. ఇప్పుడు సంక్రాంతి బరి నుండి కూడా తప్పుకుని మళ్ళీ సమ్మర్ అంటూ న్యూ ఇయర్ రోజున గ్రాండ్ గా పోస్టర్ అలాగే యాక్షన్ వీడియోని వదిలారు. అయితే ఇక్కడ గమనించారో లేదో.. ఈసారి డేట్ లాక్ చెయ్యలేదు. పాన్ ఇండియా మూవీ అంటే ఎలా ఉండాలి.

Advertisement
CJ Advs

రిలీజ్ డేట్ ఇచ్చాకే సినిమా షూటింగ్ మొదలు పెట్టాలి. కానీ అఖిల్ ఏజెంట్ పాన్ ఇండియా రిలీజ్ అంటున్నారు.. దానికి తగ్గట్టుగా మాత్రం మేకర్స్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు సమ్మర్ రిలీజ్ అని చెప్పారు కానీ డేట్ ఇవ్వలేదు, కానీ వేరే సినిమాలేమైనా సమ్మర్ లో కచ్చిఫ్ వేస్తె.. మళ్ళీ ఏజెంట్ కి డేట్ దొరకదు, అప్పుడు కూడా మార్చాల్సి వస్తుందేమో అందుకే ఇలా తేదీని ఫిక్స్ చెయ్యకుండా కన్ఫ్యూజ్ చేస్తున్నారంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

అఖిల్ ఏజెంట్ గా లుక్ వైజ్ గా అదరగొడుతున్నాడు. మలయాళీ స్టార్ హీరో మమ్ముట్టి కీ రోల్ పోషిస్తున్నారు. గ్లామర్ గర్ల్ సాక్షి హీరోయిన్ గా కనిపిస్తుంది. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్టర్, అలాగే ఏజెంట్ స్టోరీ లైన్ సూపర్బ్.. ఇన్ని జరుగుతున్నా ఏజెంట్ విషయంలో మేకర్స్ సైలెన్స్ ని అక్కినేని ఫాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.

Akhil Agent finally gets new tentative release date:

Akhil Akkineni Agent Release Postponed Again
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs