Advertisement
Google Ads BL

ఒక్క ప్రభాస్ తప్ప ఎవ్వరూ ఫామ్ లో లేరు


ప్రస్తుతం టాలీవుడ్ స్టార్స్ అంతా పాన్ ఇండియా స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రభాస్ బాహుబలితో పాన్ ఇండియా స్టార్ అయ్యి వరస ప్రాజెక్ట్ లతో కాలాన్ని పరిగెత్తిస్తున్నాడు. ఇక అల్లు అర్జున్ పుష్ప ద రైజ్ తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆ పాన్ ఇండియా క్రేజ్ ని ఎంజాయ్ చేస్తూ పుష్ప 2 మొదలు పెట్టడానికి ఏడాది సమయం తీసుకున్నాడు. పుష్ప 2 వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ట్రిపుల్ ఆర్ తో ఎన్టీఆర్-రామ్ చరణ్ లు పాన్ ఇండియా స్టార్స్ అయ్యారు. రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ కి ముందే RC15 షూటింగ్ మొదలు పెట్టినా.. అది మందకొడిగా సాగుతుంది. ఈ ఏడాది అది రిలీజ్ అవుతుందో.. లేదో.. తెలియదు.

Advertisement
CJ Advs

ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ అయితే NTR30 మొదలు పెట్టడానికే ఏడాది సమయం తీసుకున్నాడు. ఈ ఏడాదంతా షూటింగ్ చేసి వచ్చే ఏడాది 2024 ఏప్రిల్ లో NTR30 రిలీజ్ అంటున్నారు. ఇక మహేష్ బాబు అయితే SSMB28 మొదలు పెట్టడానికి ఏడెనిమిది నెలలు తీసుకున్నాడు. ఈఏడాది ఎట్టి పరిస్థితుల్లో SSMB28 రిలీజ్ అనుకుంటున్నారు. కానీ ఈ ఏడాది అది జరిగేలా కనిపించడం లేదు. కానీ ప్రభాస్ మాత్రం పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ షూటింగ్స్ తో బిజీగా ఉండడం కాదు.. ఈ ఏడాది ఆదిపురుష్ తో సహా సలార్ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నాడు.

అలాగే 2024 లో మారుతి మూవీతో పాటుగా ప్రాజెక్ట్ కే రిలీజ్ చేస్తాడు. తర్వాత 2025 లో సందీప్ వంగా మూవీ స్పిరిట్ అలాగే బాలీవుడ్ డైరెక్టర్ సిద్దార్థ్ తో చెయ్యబోయే మూవీ రిలీజ్ ఉంటుంది. సో ఏడాదికి రెండు చొప్పున ప్రభాస్ హడావిడి చేస్తుంటే.. మిగతా హీరోలు ఏడాదికి ఒక్కటి చెయ్యడం అటుంచి ఒక్కో సినిమాకి రెండేళ్ల సమయం తీసుకుంటున్నారు. ఇలా తమ హీరోలని చూసి ఫాన్స్ కూడా డిస్పాయింట్ అవుతున్నారు.

Prabhas in full swing:

Nobody is in form except Prabhas
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs