Advertisement
Google Ads BL

NTR30: అప్ డేట్ ఇచ్చి డిస్పాయింట్ చేసారు


యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా కోసం ఎన్టీఆర్ ఫాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. వాళ్ళు వెయిట్ చేసే కొలది అది వెనక్కి పోతూ ఉంది. ఎన్టీఆర్ ఫ్యామిలీతో యుఎస్ లో న్యూయార్క్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు. అక్కడే న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ చేసుకున్న ఎన్టీఆర్.. కొత్త సినిమా అప్ డేట్ వదిలారు మేకర్స్. NTR30 అప్ డేట్ అంటూ ఏదో సినిమా మొదలు పెట్టే అప్ డేట్ ఇస్తారనుకుంటే.. సినిమా విడుదల తేదీని అధికారికంగా అనౌన్స్ చేసారు. NTR30 వచ్చే ఏడాది అంటే 2024 ఏప్రిల్ 23 న రిలీజ్ అంటూ ప్రకటించారు.

Advertisement
CJ Advs

అయితే NTR30 నుండి అప్ డేట్ రావడంతో ఆనందపడాలో.. ఒక ఏడాదిన్నర వెయిట్ చెయ్యాలి గనక బాధపడాలో తెలియని అయోమయంలో ఉన్నారు ఎన్టీఆర్ ఫాన్స్. NTR30 రిలీజ్ డేట్ విషయంలో ఎన్టీఆర్ ఫాన్స్ డిస్పాయింట్ అవుతున్నారు. కొరటాల శివ ఆచి తూచి ప్రీ ప్రొడక్షన్స్ లో తలమునకలై షూటింగ్ మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఇక ఈ గత ఏడాది మార్చి లో ట్రిపుల్ ఆర్ విడుదలయ్యాక సెట్స్ మీదకి వెళ్లని ఎన్టీఆర్ మరొక్క ఏడాది ఫాన్స్ ని వెయిట్ చేయిస్తున్నారు. ఓవరాల్ గా ఎన్టీఆర్ మళ్ళీ కొత్త సినిమాతో అభిమానులని రెండేళ్ల తర్వాత కలవబోతున్నారు.

NTR30 పాన్ ఇండియా మూవీగా వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతుంది. ఈ చిత్రం హీరోయిన్ గా కియారా అద్వానీ పేరుని పరిశీలిస్తున్నారు.

NTR30 in cinemas on April 5th, 2024:

NTR30 release date update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs