మామూలుగగానే మందు కొట్టి రెచ్చిపోయి కార్ డ్రైవ్ చెయ్యడం, బైక్ డ్రైవ్ చెయ్యడం చేసి ఎక్కడో చోట యాక్సిడెంట్ చెయ్యడమో, లేదంటే ట్రాఫిల్ పోలీస్ లకి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయి ఫైన్ కట్టడం చాలామందిని చూస్తూనే ఉంటాం. హైదరాబాద్ లో మందుబాబులు విచ్చలవిడిగా మందుతాగేసి రోడ్ల మీద పడతారు. అయితే ఇప్పుడు మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం దిమ్మతిరిగే షాకిచ్చింది. ఈ 31 రాత్రి మందు తాగి రోడ్డెక్కి పోలీస్ లకి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే మాములుగా ఉండదు.
ఒక్కసారి మందుకొట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే పది వేలు ఫైన్, ఆరు నెలలు జైలు శిక్ష. అదే రెండోసారి పట్టుబడితే మాత్రం వాచిపోతుంది. పదిహేను వేలు ఫైన్ కట్టడంతో పాటుగా రెండేళ్లు జైలు శిక్ష అనుభవించాల్సిందే. రూల్స్ అతిక్రమిస్తే మాములుగా ఉండదు అంటూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తాగేసి బైక్ లని, కారులని రేజ్ చేస్తూ పొతే ఇకపై జైలులో కూర్చోవాల్సిందే. ఇలా అయినా డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్స్ తగ్గించాలని తెలంగాణ పోలీస్ లు ప్లాన్ అన్నమాట. అందుకే మరి మందు బాబులు జర జాగ్రత్త మందుకొట్టి రోడెక్కేముందు కాస్త ఆలోచించబడి.
పోలీస్ లకి చిక్కారా ఇక అంతే.. జైలుకి పోవాల్సిందే. ఇకపై ఈ ఫైన్స్ తో తెలంగాణ ప్రభుత్వానికి విపరీతమైన రాబడి ఉండడం ఖాయం. మరి మందు బాబులు ఎన్ని ఫైన్స్ వేసినా మారరు. కాస్త జైలు భయమైన ఉంటే మారతారేమో చూడాలి.