అ..ఆ సినిమాలో నెగెటివ్ షేడ్స్ లో కనిపించిన అనుపమ పరమేశ్వరన్ తర్వాత క్యూట్ అండ్ స్వీట్ పాత్రల్లో కనిపించింది. ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ రంగస్థలం అవకాశం చేజార్చుకున్న అనుపమ ఈ ఏడాది కార్తికేయ 2 తో పాన్ ఇండియా హిట్ అందుకుంది. ట్రెడిషనల్ గా అచ్చ తెలుగమ్మాయిలా ఉండే అనుపమ గ్లామర్ కి ఆమడదూరంగా ఉండేది. కానీ కొద్ది రోజులుగా అనుపమ పరమేశ్వరన్ అందాలు ఆరబొయ్యడానికి రెడీ అనే సంకేతాలు ఇస్తూ ఫోటో షూట్స్ తో చెబుతోంది. కార్తికేయ 2 లో నిఖిల్ తో జోడి కట్టిన అనుపమ అనుకోకుండా పాన్ ఇండియా హిట్ అందుకుంది.
ఆ తర్వాత అదే నిఖిల్ తో వెంటనే 18 పేజెస్ అంటూ క్యూట్ లవ్ స్టోరీ తో ఆడియన్స్ ని మెప్పించింది. దానితో అనుపమ మర్కెట్ పెరిగింది. క్రేజ్ పెరిగింది. అందుకే పాప పారితోషకం కూడా అమాంతం పెంచేసింది. ఇప్పటివరకు కోటి లోపలే దోబూచులాడింది, కానీ ఇప్పుడు రెండు హిట్స్ పడడంతో అనుపమ రేటు బాగా పెరిగింది. 60 లక్షల నుండి ఏకంగా 1.2 కోట్లకి పెంచేసిందట. మరి ఈ లక్కీ బ్యూటీ రేటు పెరిగినా తెలుగులో అవకాశాల జోరు కూడా పెరిగింది. తమిళ, మలయాళంలో పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్న అనుపమకి ఈ ఏడాది మాత్రం బాగా కలిసొచ్చింది.
అటు హిట్స్, ఇటు పారితోషకం పరంగా అమ్మడు ఫుల్ హ్యాపీ. కానీ ఇదే ఏడాది అనుపమ డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ క్రేజీ అవకాశాన్ని కొన్ని కారణాల వలన వదులుకుంది.