Advertisement
Google Ads BL

ప్రాజెక్ట్ K పై సూపర్ అప్ డేట్


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మహానటి నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో అశ్విని దత్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ K(వర్కింగ్ టైటిల్) షూటింగ్ శరవేగంగా జరక్కపోయినా.. ఆ సినిమాపై భారీ అంచనాలున్నాయి. పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతున్న దీని కోసం ఏ వస్తువు కావాలన్నా తయారు చేసుకోవాలనే ఉద్దేశ్యంతో నాగ్ అశ్విన్ చిన్న సామెతని చెప్పాడు. మహానటి కోసం కారు కావాలంటే అద్దెకి తేవొచ్చు, కానీ ప్రాజెక్ట్ K కోసం తయారు చెయ్యాలని చెప్పినట్టుగానే.. ఇప్పుడు వదిలిన ఓ వీడియోలో పెద్ద లారీ చక్రాన్ని తయారు చేస్తున్నట్టుగా చూపించారు.

Advertisement
CJ Advs

ప్రభాస్ ని, దీపికా, దిశలు ఎవరూ లేకుండా ఈ వీడియో కట్ లో స్క్రాచ్ తో తమ సినిమా ఎలా మొదలు పెట్టామో ఆ వీడియోలో చూపించారు. ఆ వీడియో లో లారీ చక్రాన్ని తయారు చెయ్యడానికి చాలామంది కష్టపడుతుంటే.. ఈ మాత్రం చక్రం షాపులో దొరుకుతుంది కదా అని ఒక పని చేసేవాడితో చెప్పించారు. మరి టైమ్ ట్రావెల్ తో ప్రభాస్ ని సూపర్ మ్యాన్ లా చూపించబోతున్నారనే న్యూస్ కి ఈ లారీ చక్రం తయారీకి లింక్ చేస్తే.. కొత్త ఊహాగానాలు మొదలవుతున్నాయి. అందులో ఆదిత్య 369 దర్శకుడు సింగీతం ఈ స్క్రిప్ట్ లో బాగమైనందున ఈ సినిమా టైమ్ ట్రావెల్ తోనే రూపొందుతుంది అనేది అర్ధమవుతుంది.

ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రాజెక్ట్ K కొత్త షెడ్యూల్ జనవరి నెల చివరి వారం నుండి మొదలై శరవేగంతో షూటింగ్ కంప్లీట్ చేసుకుంటుంది అని.. అది పూర్తయ్యాకే ప్రాజెక్ట్ K రిలీజ్ డేట్ పై మేకర్స్ ఓ అవగాహనకి వస్తారని తెలుస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ కి ఏడెనిమిది నెలలు టైమ్ పడుతుంది అంటే.. ప్రాజెక్ట్ K ఫైనల్ గా 2024 సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Super news on Project K:

Prabhas Project K update 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs