బాలీవుడ్ హాట్ కపుల్ కియారా అద్వానీ బాయ్ సిద్దార్థ్ మహోత్రతో త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుంది అంటూ బాలీవుడ్ మీడియాలో బోలెడంత ప్రచారం జరుగుతుంది. కబీర్ సింగ్ తో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిన కియారా అద్వానీ సౌత్ లో హిట్టుకొట్టాలని చూస్తుంది. గ్లామర్ డాల్ లా అందాలు ఆరబోస్తూ సోషల్ మీడియాలో యూత్ ని పడేసే కియారా బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా ప్రేమలో మునిగితేలుతోంది. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ ప్రచారం జరగడమే కానీ.. వారు ఈ విషయమై స్పందించిందిలేదు.
ప్రస్తుతం కూడా కియారా-సిద్దార్థ్ మహోత్రాలు కలిసే వెకేషన్స్ కి వెళ్లారు, న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం విదేశాలకి చెక్కేసిన ఈ జంట పక్షులు త్వరలోనే అంటే 2023 మొదట్లోనే పెళ్లి పీటలెక్కబోతున్నారని తెలుస్తుంది. అది కూడా ఫిబ్రవరి 6 న కియారా-సిద్దార్థ్ లు వివాహానికి ఇరు కుటుంబాల వారు ముహుర్తాలు పెట్టారని, వీరి పెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్ గా రాజస్థాన్ లోని జైసల్మేర్ పోర్ట్ ని వేదికగా ప్లాన్ చేసుకున్నట్లుగా కూడా ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది.
కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రా పెళ్ళికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు అలాగే బాలీవుడ్ నుండి అతి ముఖ్యమైన కొద్దిమంది ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది అంటున్నారు. ఫైనల్ గా ఈ వెడ్డింగ్ డేట్ ని కియారా-సిద్దార్థ్ లు జనవరిలో ఎనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.