Advertisement
Google Ads BL

అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పిన పూర్ణ


హీరోయిన్ అవకాశాల కోసం చూసి చూసి చివరికి కేరెక్టర్ ఆర్టిస్ట్ గాను, బుల్లితెర మీద జెడ్జ్ గా సెటిల్ అయిన నటి పూర్ణ ఈ ఏడాది పెళ్లి చేసుకుంది. దుబాయ్ కి చెందిన అసిఫ్ అలీ తో జూన్ 12 న ఏడడుగులు నడిచిన పూర్ణ పెళ్లి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాదు, ఈ పెళ్ళిలో భర్త నుండి ఆమె పొందిన బహుమతులు కూడా అంతే వైరల్ అయ్యాయి. పెళ్ళికి ముందు నటిగా కొనసాగుతున్న పూర్ణ పెళ్లి తర్వాత కూడా బుల్లితెర షోస్ లో కనిపిస్తుంది. స్పెషల్ సాంగ్స్ లో చేస్తుంది. పెళ్లి తర్వాత కూడా నటనకు దగ్గరగానే ఉన్నాను అని చెబుతున్న పూర్ణ ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి.

Advertisement
CJ Advs

తాజాగా పూర్ణ ఫాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాదే పెళ్లాడిన భర్త అసిఫ్ ఆలీకి ఎప్పటికి మరిచిపోలేని తీపి వార్తని అందించింది. పూర్ణ తల్లి కాబోతుంది. పూర్ణ తల్లవుతున్నట్లుగా తెలపడంతో అసిఫ్ కి పూర్ణకి సోషల్ మీడియా ద్వారా ఆమె స్నేహితులు, సన్నిహితులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి 2022 ఎవరికి ఎలా ఉన్నా పూర్ణ జీవితంలో మరిచిపోలేని తీపి సంవత్సరంగా మిగిలిపోయింది.  

Actress Poorna announces her pregnancy:

Shamna Kasim Announces Pregnancy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs