Advertisement
Google Ads BL

చరణ్-ప్రభాస్ మధ్యన ఇంత ఫ్రెండ్ షిప్?


సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్-గోపీచంద్ స్నేహితులు అని అందరికి తెలుసు, అలాగే ఎన్టీఆర్-రామ్ చరణ్ ఫ్రెండ్స్ అని తెలుసు, మహేష్ బాబు-పవన్ కళ్యాణ్ స్నేహితులు అని తెలుసు. కానీ ప్రభాస్-రామ్ చరణ్ మధ్యన ఏరా అంటే ఏరా అనుకునే దోస్తీ ఉంది అనేది మాత్రం ఎవ్వరికి తెలియదు. ప్రభాస్ ఫామ్ హౌస్ కి వెళ్లి రామ్ చరణ్ పార్టీ చేసుకునేంత డీప్ ఫ్రెండ్ షిప్ వారి మధ్యన ఉంది అనేది బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షో ద్వారానే బయటపడింది. రీసెంట్ గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆహా అన్ స్టాపబుల్ టాక్ షోలో పాల్గొన్నాడు. బాలకృష్ణ-ప్రభాస్ ఒకరిని మించి ఒకరు ఫాన్స్ ని ఈ షోలో మెస్మరైజ్ చేసారు. 

Advertisement
CJ Advs

బాలయ్యని, ప్రభాస్ ని అభిమానులు అలా చూస్తూ ఎంజాయ్ చేసారు. నన్ను కూడా డార్లింగ్ అనాలి అంటూ బాలయ్య పట్టుబట్టగా.. చివరికి బాలయ్యని డార్లింగ్ అంటూ ప్రభాస్ సంబోదించాడు. ఇక బాలకృష్ణ అందరూ సెలబ్రిటీస్ లాగే నీకు ఓ అట ఉంది అంటూ రామ్ చరణ్ తో ఫోన్ మాట్లాడించాలని అనగా.. ప్రభాస్ చరణ్ కి ఫోన్ చేసి ఇచ్చాడు. ఇక రామ్ చరణ్ ఈ షోలో ప్రభాస్ ని ఉడికించాడు చూడండీ.. అరే చరణ్ నువ్వు నా శత్రువువి రా, నువ్వు నా ఎనిమి, మొత్తం పెంట చేసేసావ్ అంటూ గోల గోల చేసేసాడు. ప్రభాస్ లైఫ్ లో యువరాణి ఉంది అది సననా, షెట్టినా అంటూ బాలయ్య అడగ్గానే.. బాలయ్య సర్ ప్రభాస్ త్వరలోనే మీకు గుడ్ న్యూస్ చెబుతాడని చరణ్ అన్నాడు, అరే చరణ్ నువ్వు ఇలా ముంచేసావ్ ఏంట్రా బాబు, ఓ నాలుగు రోజులు పాటు సోషల్ మీడియాలో ఇదే ఏసుకుంటారు. అయితే చరణ్ చివరిగా ప్రభాస్ లైఫ్ లో ఏ అమ్మాయి లేదు సర్ అని క్లారిటీ ఇచ్చాడు.

ప్రభాస్ మాత్రం సరదాగా.. నువ్వు నువ్ నా ఫ్రెండ్ వి కాదు శత్రువువి.. నువ్ ఆహా టాక్ షోకి వస్తావ్ గా అప్పుడు బాలయ్య సర్ నాకే ఫోన్ చేస్తారు. అప్పుడు చెప్తా నీ సంగతి.. సర్ మీరు చరణ్ వచ్చినప్పుడు నాకే ఫోన్ చెయ్యాలంటూ ప్రభాస్ చెప్పడం చూసి.. అమ్మో చరణ్ కి ప్రభాస్ కి మధ్యన ఇంత ఫ్రెండ్ షిప్ ఉందా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. డార్లింగ్ ఫాన్స్-మెగా ఫాన్స్ అయితే ఈ బాండింగ్ చూసి కేరింతలు కొడుతున్నారు.

So much friendship between Charan-Prabhas?:

Ram Charan confirms there's no lady in Prabhas life currently
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs