Advertisement
Google Ads BL

రకుల్ ఏంటీ అవతారం..


రకుల్ ప్రీత్ ఒకప్పుడు తెలుగు స్టార్ హీరోలందరి సినిమాల్లో కనిపించి స్టార్ హీరోయిన్ స్టేటస్  ని ఎంజాయ్ చేసిన తార. చక్కగా బబ్లీగా, అందంగా, ఆకర్షణగా ఉండే రకుల్ ప్రీత్ మహేష్ బాబు తో చేసిన స్పైడర్ దెబ్బకి టాలీవుడ్ లో మిస్సయ్యి బాలీవుడ్ లో తేలింది. స్పైడర్ మూవీ షాక్ నుండి రకుల్ చాలారోజులు తేరుకోలేకపోయింది. తర్వాత తెలుగులో పెద్దగా కనిపించని రకుల్ బాలీవుడ్ కి వెళ్లి సీనియర్ హీరోలకి కేరాఫ్ అడ్రెస్స్ గా మారి నాలుగు ప్రాజెక్టులు చేతిలో పెట్టుకుని కళకళలాడుతూనే ఉంది. 

Advertisement
CJ Advs

కానీ బరువు తగ్గాలనే తాపత్రయంలో రకుల్ ప్రీత్ పూర్తిగా వర్కౌట్స్ మీద పడిపోయింది. జిమ్ లోనో, యోగాలోనో సమయం గడిపిన రకుల్ ప్రీత్ సన్నగా మారిపోయింది. బరువుతో పాటుగా అందాన్ని కోల్పోయింది. బరువు తగ్గడం అంటే సైజు జీరోనే కాదు, ఇంకా కొన్ని ఇబ్బందులు ఉంటాయంటూ సోషల్ మీడియాలో తనపై జరిగే ట్రోలింగ్ కి సమాధానం చెప్పే రకుల్ ప్రీత్ ఈ మధ్యన మరీ చిక్కిపోయింది. 2022 కి గుడ్ బై చెబుతూ 2023 కి గ్లామర్ గా వెల్ కమ్ చెప్పింది. Smiling towards 2023.. bring it on 💕 #phuket #blessed #goodvibesonly అంటూ ట్వీట్ చేసిన రకుల్ కొన్ని ఫొటోస్ ని షేర్ చేసింది.

ఆ ఫొటోస్ లో రకుల్ ప్రీత్ సన్నగా, కళావిహీనంగా మరీ ఘోరంగా కనిపించడంతో.. ఆ పిక్స్ చూసిన నెటిజెన్స్ ఏంటి రకుల్ ఏంటీ అవతారం అంటూ కామెంట్ చేస్తున్నారు.

Rakul Preet Singh is smiling towards 2023:

Rakul Preet Singh latest look viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs