Advertisement
Google Ads BL

క్రికెటర్ రిషబ్ పంత్ కి ఘోర రోడ్డు ప్రమాదం


టీమ్ ఇండియా క్రికెటర్ రిషబ్ పంత్ కి ఘోరమైన రోడ్ యాక్సిడెంట్ జరిగి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు డివైడర్ ని ఢీకొని ప్రమాదానికి గురి కాగా.. రిషబ్ కి తీవ్రగాయాలయ్యాయి. ఆ తర్వాత రిషబ్ ప్రయాణిస్తున్న కారు దగ్దమైంది. రిషబ్ పంత్ కి యాక్సిడెంట్ అయ్యింది అని తెలుసుకున్న ఆయన అభిమానులు ఆందోళనపడుతున్నారు.

Advertisement
CJ Advs

ఉత్తరాఖండ్ లోని రూర్కీ సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. రిషబ్ పంత్ ఉత్తరాఖండ్ రూర్కీ నుండి ఢిల్లీ వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో రిషబ్ పంత్ డ్రైవ్ చేస్తున్నాడు. ఈ యాక్సిడెంట్ జరిగిన సమయంలో కారులో రిషబ్ పంత్ ఒక్కడే ఉన్నాడని పోలీస్ లు తెలిపారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే కారు దగ్దమవడం స్టార్ట్ అవ్వగా.. రిషబ్ పంత్ తెలివిగా కారు అద్దాలు పగలగొట్టుకుని కారు నుండి బయటికి రావడంతో గాయాలతో కొంత సేఫ్ అయ్యాడని తెలుస్తుంది.

ఈ యాక్సిడెంట్ లో రిషబ్ పంత్ తలకు, మోకాలికి గాయాలవ్వగా.. వీపు భాగం మాత్రం కాలినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా కాలికి కూడా ఫ్రాక్చర్ అయింది. ప్రమాదం జరిగిన వెంటనే రిషబ్ ని రూర్కీ ఆసుపత్రికి తరలించి.. అక్కడినుండి మంచి వైద్యం కోసం డెహ్రాడూన్ ఆసుపత్రికి మార్చినట్లుగా తెలుస్తుంది.

Cricketer Rishabh Pant met with a serious road accident:

Rishabh Pant accident: BMW car hits divider, Pant severely injured
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs