Advertisement
Google Ads BL

కృతి సనన్ తో డేటింగ్ పట్ల ప్రభాస్ ఆన్సర్


బాలకృష్ణ-ప్రభాస్ కలిసి అన్ స్టాపబుల్ ఎపిసోడ్ చేస్తే.. ఎట్లా ఉంటుందో తెలుసా.. ఇలా ఉంటుంది అంటూ ప్రభాస్ ఫాన్స్, బాలయ్య ఫాన్స్ కలిసి ఆహా సైట్ ని క్రాష్ చేసేంత ఉంటుంది అంటూ గత రాత్రి 9 గంటలు నుండి ఆడియన్స్ కి చుక్కలు చూపించారు. బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షో కి ఉన్న క్రేజ్, ప్రభాస్ కి పాన్ ఇండియా అభిమానం కలిసి వచ్చిన హైప్ అన్ని ఆహా ఓటిటి ని షేక్ చేసాయి. ప్రభాస్ బాహుబలి ఎపిసోడ్ కోసం రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులు ఎంత ఆకలితో ఉన్నారు ఆహా సబ్ స్క్రైబ్ చేసి చూపించారు. ఆహాలో బాహుబలి ఎపిసోడ్ కోసం ఓపెన్ చేసినవారికి షాక్ తగిలింది. 9 గంటలకు స్ట్రీమింగ్ అయిన ఎపిసోడ్ కోసం రాత్రంతా పడిగాపులు కాచేలా చేసింది ప్రభాస్, బాలయ్య క్రేజ్. 

Advertisement
CJ Advs

ఇక ఓపెన్ అయ్యాక ఆత్రంగా ఎపిసోడ్ ని వీక్షించిన వారు ప్రభాస్ ఏం మాట్లాడాడో, బాలయ్య ఎలా ఆడించారో బిట్ బిట్ లుగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు. ప్రభాస్ ని ప్రస్తుతం తనపై నడుస్తున్న లవ్ ఎఫ్ఫైర్, కృతి సనన్ తో డేటింగ్ రూమర్ గురించి బాలయ్య స్ట్రయిట్ గా అడిగేసారు. దానికి ప్రభాస్ కూడా మేడమ్ ఆల్రెడీ చెప్పిందిగా ఏమి లేదని అని చెప్పాడు. అలా చెప్పించావా అనగానే ప్రభాస్ నవ్వేసాడు.. అయినా మేడమ్ ఏమిటి మేడం అన్నారు బాలయ్య. మేడమ్ సనన్ అంటూ ప్రభాస్ సాగదీసాడు.

అవును మేడమ్ లోనే ఉంది అంతా వసు మేడమ్, వసు మేడం అంటూ నేను ఇంటికి వెళ్తాను అంటూ బాలకృష్ణ కూడా ఫన్ చేసారు. అంతేకాకుండా నువ్వు నవ్వుతూ నో అంటున్నావ్, ఆ అమ్మాయేమో సీరియస్ గా నో అంటుంది. కానీ బయట ఇంటర్నెట్ లో అంటూ ప్రభాస్ ని మరోసారి కెలికారు బాలయ్య. మీకు తెలియంది ఏముంది సర్ సోషల్ మీడియా అంటే.. మీపై ఎన్నో వచుంటాయి. అప్పట్లో సోషల్ మీడియా లేదు కాబట్టి మీమీద రాయలేదు, కానీ మాకేం లేకపోయినా ఇప్పుడు రాస్తున్నారు. అంటూ ప్రభాస్ ఉడికిపోయాడు. కానీ బాలయ్య చెప్పు మేడమ్ పేరేంటి, మేడమ్ పేరేంటి అంటూ ప్రభాస్ ని బాగా రాగ్ చేసారు బాలయ్య.

Prabhas reacts on Dating rumours:

Prabhas reacts on dating Kriti Sanon rumors on Unstoppable
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs