Advertisement
Google Ads BL

ప్రీ ప్రొడక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్


పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు షూటింగ్ లో బిజీగా వున్నారు. అంతేకాకుండా వారాహి వాహనంతో రాజకీయాల్లో కొత్త వరవడి సృష్టించడానికి రెడీ అవుతున్నారు. జనవరి 2 న వారాహి వాహన పూజా కార్యక్రమాలు నిర్వహించి తర్వాత పవన్ కళ్యాణ్ రోడ్ షో కి ముహూర్తం పెడతారని తెలుస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొంటున్నారు. అటు హరీష్ శంకర్ తో చెయ్యబోయే ఉస్తాద్ భగత్ సింగ్ పూజా కార్యక్రమాలతో ఈమధ్యనే మొదలయ్యింది. కానీ రెగ్యులర్ షూట్ కి వెళ్ళలేదు. అయినప్పటికీ హరీష్ శంకర్ ఉస్తాద్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో చాలా బిజీగా ఉన్నట్లుగా కొన్ని పిక్స్ వదిలి కన్ ఫర్మ్ చేసారు.

Advertisement
CJ Advs

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, అలాగే పవన్ కళ్యాణ్ ఫ్రెండ్, నటుడు తో హారిష్ శంకర్ మీటింగ్ పెట్టారు. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ ప్రొడక్షన్ ఫుల్ స్వింగ్ లో ఉంది అంటూ ఇచ్చిన అప్ డేట్ కి పవన్ ఫాన్స్ కి పూనకలొచ్చేస్తున్నాయి. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ని హరీష్ శంకర్ ఏ స్టయిల్లో ప్రెజెంట్ చేస్తారో అని ఆతృతగా ఉన్నారు వారు. పవన్ కి జోడిగా పూజ హెగ్డే నటించనుంది అని ప్రచారం జరుగుతున్నా.. ఆమె ఈ సినిమా చెయ్యడం లేదు అనే రూమర్ కూడా ప్రచారంలో ఉంది.

ఫైనల్ గా ఉస్తాద్ కి తగిలే ఆ హీరోయిన్ ఎవరో కానీ.. పవన్ ఫాన్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూట్ కి వెళ్లే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది.

Ustaad Bhagat Singh in full josh:

Ustaad Bhagat Singh pre-production underway
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs