Advertisement
Google Ads BL

అదరగొడుతున్న విజయ్-సైలెంట్ మోడ్ లో అజిత్


కోలీవుడ్ లో ప్రస్తుతం, విజయ్ ఫాన్స్ vs అజిత్ ఫాన్స్ అన్నట్టుగా ఉంది వ్యవహారం, అజిత్ vs  విజయ్, వారిసు vs తునీవు అన్నట్టుగా ఫాన్స్ కొట్లాట మొదలయ్యింది. మామూలుగానే అజిత్ ఫాన్స్ కి విజయ్ ఫాన్స్ కి అస్సలు పడదు. ఇప్పుడు పొంగల్ కి విజయ్ vs అజిత్ అన్న రేంజ్ లో థియేటర్స్ పంపకాలు కూడా మొదలయ్యాయి. వారిసు నిర్మాత దిల్ రాజు విజయ్ కోసం ఎక్కువ థియేటర్స్ డిమాండ్ చేస్తున్నాడు. మరోపక్క చెన్నైలో వారిసు ప్రమోషన్స్ భీబత్సంగా మొదలయ్యాయి.

Advertisement
CJ Advs

ఇప్పటికే వారిసు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ అభిమానులని ఉర్రుతలూగించారు. కానీ అజిత్ వైపు నుండి ఎలాంటి సందడి లేదు. తునీవు విడుదల అని మేకర్స్ ప్రకటించినా.. జస్ట్ సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు తప్ప.. మరో పోటీ సినిమా వారిసు ప్రమోషన్స్ తో పోల్చుకుంటే.. అజిత్ తునీవు ప్రమోషన్స్ చాలా వీక్ గా ఉన్నాయి. మామూలుగానే అజిత్ పెద్దగా సినిమా ప్రమోషన్స్ లో కనిపించడు. ఇంతపోటి ఉన్నప్పుడు గట్టిగా ప్రమోషన్స్ చేస్తే.. సినిమాపై క్రేజ్, హైప్ క్రియేట్ అవుతుంది. కానీ అజిత్ సైలెంట్ గానే కనబడుతున్నాడు.

అలాగే తెలుగులోనూ తునీవు తెగింపు టైటిల్ తో రిలీజ్ కాబోతుంది. తమిళంలోనే పెద్దగా ప్రమోషన్స్ కి రాని అజిత్ తెలుగుని పిచ్చ లైట్ తీసుకుంటాడు. కానీ విజయ్ తెలుగులోనూ మర్కెట్ పెంచుకోవాలని చూస్తూ సినిమాని ప్రమోట్ చేస్తాడు. దిల్ రాజు ముందు విజయ్ వారిసు ని తమిళంలో ప్రమోట్ చేసాక ఇక్కడ తెలుగు ప్రేక్షకులముందుకు తీసుకొచ్చి వారసుడిని ఆడియన్స్ లోకి తీసుకొళ్లే ఆలోచనలో ఉన్నాడు. 

అజిత్ ఇలా ఉంటే సినిమా ఓపెనింగ్స్ కూడా తెలుగులో దక్కేలా లేవు. ఎందుకంటే తెలుగులో సంక్రాంతికి ఇద్దరు సీనియర్ బడా హీరోలు సినిమాలని రిలీజ్ చేస్తున్నారు. ఎంతో కొంత క్రేజ్ ఉన్న విజయ్ వారసుడు రాబోతుంది. ఆ మూడిట్లో అజిత్ తెగింపుని ఎవరు పట్టించుకుంటారు. కాస్త మేకర్స్ ఆలోచిస్తే బావుంటుంది.

Vijay vs Ajith:

Hero Vijay Varisu vs Ajith Thunivu 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs