Advertisement
Google Ads BL

గూఢచారి లవర్స్ కి గుడ్ న్యూస్


ఈ ఏడాది మధ్యలో మేజర్ మూవీ తో పాన్ ఇండియా హిట్ అందుకున్న యంగ్ హీరో అడివి శేష్ రీసెంట్ గా హిట్ 2 తో సూపర్ హిట్ కొట్టాడు. హిట్ 2 తర్వాత అడివి శేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్  పై అందరిలో క్యూరియాసిటీ మొదలైంది. అడివి శేష్ కూడా కొద్దిగా గ్యాప్ తీసుకుని తన తదుపరి మూవీని ప్రకటించేశాడు. కథల ఎంపికతో ప్రేక్షకుల్లో ఒక కల్ట్ ఫాలోయింగ్ సంపాదించారు. అడివి శేష్ గూఢచారి ఒక పాత్ బ్రేకింగ్ మూవీ. ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. అడివి శేష్ గూఢాచారి సీక్వెల్‌ ని G2 పేరుతో తదుపరి ప్రాజెక్ట్‌ గా ప్రకటించారు. G2 టీం ప్రీ విజన్ వీడియోను జనవరి 9వ ఢిల్లీ, ముంబై రెండింటిలో ఒకే రోజున విడుదల చేయనుంది.

Advertisement
CJ Advs

మేజర్ చిత్రానికి ఎడిటర్ గా పని చేసిన వినయ్ కుమార్ సిరిగినీడి G2 చిత్రానికి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. అడివి శేష్ స్వయంగా కథ రాశారు. ఈ భారీ-బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని మూడు ప్రముఖ ప్రొడక్షన్ హౌస్‌ లు కలసి నిర్మిస్తున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్‌ టైన్‌ మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

మేకర్స్ ఈ చిత్రం కాన్సెప్ట్ పోస్టర్‌ ను కూడా విడుదల చేసారు. ఇందులో బ్లాక్ సూట్‌ లో చేతిలో మెషిన్ గన్ పట్టుకుని, అతను యాక్షన్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాడని తెలియజేస్తోంది.

గూఢాచారి కథ మొత్తం భారతదేశంలోనే జరగగా, G2 అంతర్జాతీయంగా ఉండబోతోంది. ఆల్ప్స్ పర్వతాలలో గూఢాచారి ముగిసిన ప్రదేశం నుండి గూఢచారి పార్ట్ 2 ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఉన్న స్టార్ కాస్ట్‌ తో అనేక కొత్త పాత్రలు చేరి రెట్టింపు యాక్షన్‌ ను డిజైన్ చేయాలని మేకర్స్ కోరుకుంటున్నారు.

G2 will get ALL INDIA launch on Jan 9:

Adivi Sesh Pan India Movie G2 will get ALL INDIA launch on Jan 9
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs