Advertisement
Google Ads BL

సౌత్ పై రష్మిక వివాదాస్పద వ్యాఖ్యలు


రష్మిక ఏం మాట్లాడినా అది కాంట్రవర్సీ అయ్యిపోతుంది. సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా సౌత్ నుండి హిందీలోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక గ్లామర్ పరంగా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసినా, ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు కూడా అంతే సెన్సేషన్ అవుతున్నాయి. కాంతార విషయంలో, హీరో రిషబ్ శెట్టి విషయంలో ఆమె చేసిన ఇండైరెక్ట్ కామెంట్స్ కాంట్రవర్సీని క్రియేట్ చేసాయి. ఆ వివాదంపై రష్మిక క్లారిటీ ఇచ్చినా అవి సద్దుమణగలేదు.

Advertisement
CJ Advs

ఇప్పుడు రష్మిక హిందీ మూవీ ప్రమోషన్స్ లో సౌత్ మూవీస్ పై చేసిన కామెంట్స్ మరింత వివాదాస్పదంగా మారాయి. రష్మిక బాలీవుడ్ లో సిద్దార్థ్ మల్హోత్రాతో చేసిన మిషన్ మజ్ను ఓటిటి నుండి రిలీజ్ అవుతుంది. అయినప్పటికీ.. ఆ సినిమా ప్రమోషన్స్ మంచి ఊపులో ఉన్నాయి. ఆ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న రష్మిక అక్కడ మీడియా మీట్ లో సౌత్ సాంగ్స్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆమెని ట్రోల్ చేసేందుకు ఊతమిచ్చాయి. తాను చిన్నప్పటినుండి హిందీ సినిమాల్లోని రొమాంటిక్ సాంగ్స్ వింటూ పెరిగాను అని, సౌత్ సాంగ్స్ కంటే నార్త్ సాంగ్స్ బావుంటాయి. 

హిందీలో మెలోడీస్ బావుంటాయి. సౌత్ లో అన్నీ మసాలా సాంగ్స్ ఉంటాయి. అంటే ఐటెం సాంగ్, డాన్స్ నెంబర్లు అలా అన్నమాట అంటూ నవ్వేసి రశ్మికని చూసిన సౌత్ ఆడియన్స్ గుర్రుగా ఉన్నారు. సౌత్ సినిమాలతో సక్సెస్ అయ్యి, ఇక్కడ నుండి పాన్ ఇండియా హిట్ అందుకుని, స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ అక్కడ హిందీలో ఒకటి రెండు అవకాశాలకే అంత పొగరు చూపిస్తుందా రష్మిక అంటూ నెటిజెన్స్ సైతం ఆమెపై మండిపడుతున్నారు. 

Rashmika Mandanna degraded South Indian Cinema:

Rashmika says, South cinema is all about masala and item numbers
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs