Advertisement
Google Ads BL

శ్రీముఖి డ్రెస్ పై మాజీ హీరోయిన్ కామెంట్స్


యాంకర్ శ్రీముఖి ఇప్పుడు గ్లామర్ డాల్ గా రంగు రంగుల సీతాకోక చిలుకలా మారిపోయి అందాల ఆరబోతకు కొత్త అర్ధం చెబుతుంది. బబ్లీగా ఉండే శ్రీముఖి బరువు తగ్గి నాజూగ్గా తయారవడమే కాదు.. దానికి తగ్గ అవుట్ ఫిట్స్ తో ఫైర్ పుట్టిస్తుంది. ఏ ఛానల్ చూసినా శ్రీముఖి షోస్, ఆమె యాంకరింగ్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఈటీవీలో, జీ తెలుగులో, స్టార్ మా, జెమిని, ఆఖరికి ఆహా ఓటిటిలోను శ్రీముఖినే. అంతలా క్రేజ్ పెరిగిపోయింది ఆమెకి.

Advertisement
CJ Advs

అయితే BB జోడి అంటూ స్టార్ మా లో రాధా, సదా, తరుణ్ మాస్టర్ జేడ్జ్ లుగా రాబోతున్న షో లో శ్రీముఖి యాంకర్, బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ ని జోడీలుగా మార్చి BB జోడిగా పెట్టి డాన్స్ పెరఫార్మెన్సెస్ తో దుమ్ము రేపుతున్నారు. ఈ షోకి యాంకరింగ్ చేస్తున్న శ్రీముఖి డ్రెస్ పై మాజీ హీరోయిన్ మాధవి లత షాకింగ్ కామెంట్స్ చేసింది. మాధవి లత ఇన్స్టా స్టోరీస్ లో  శ్రీముఖి బాడీకి ఆ డ్రెస్ సెట్ కాలేదు అంటూ కామెంట్ చేసింది. అంతేకాకుండా ఎలా ఉండాలో సలహాలు కూడా ఇచ్చింది.

శ్రీముఖి, నువ్వు మోడరన్, అల్ట్రా మోడరన్ డ్రెస్ లు వేసుకో.. కానీ అవి నీ ఫిగర్ కి సెట్ అయ్యేలా చూసుకో.. కళ్ళకి నచ్చితే కాదు నీ బాడీ కి సెట్ అవ్వాలి, అప్పుడే చూడడానికి బావుంటాయంటూ మాధవీలత చేసిన పోస్ట్ క్షణాల్లో వైరల్ అవ్వడం కాదు, ఆమె పోస్ట్ ని షేర్ చేస్తూ నెటిజెన్స్ కూడా మాధవి లత కామెంట్స్ ని సపోర్ట్ చేస్తున్నారు.

Former heroine comments on Sreemukhi dress:

Madhavi Latha comments on Sreemukhi dress
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs