అన్ స్టాపబుల్ టాక్ షో తో అడుగడుగునా అందరిని ఆశ్చర్యపరుస్తూ అదరగొట్టేస్తున్న నందమూరి బాలకృష్ణ కొద్ది రోజులుగా ట్రెండ్ అవుతున్నారు. ప్రభాస్ బాహుబలి ఎపిసోడ్, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్స్ పై విపరీతమైన క్రేజ్ అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రభాస్ బాహుబలి ఎపిసోడ్ రెండు పార్ట్ లుగా రాబోతున్నట్టుగా ప్రకటించి చిన్నపాటి ప్రోమో కూడా వదిలారు. ప్రభాస్ బాలయ్య బాబు కి దణ్ణం పెడుతూ చేసిన విన్యాసాలు చూసి ఫాన్స్ క్రేజీగా ఎగ్జైట్ అవుతున్నారు. అందరూ డార్లింగ్ అంటారు.. డార్లింగ్ అంటే దెయ్యాలు కూడా దేవతలుగా మారిపోతారేమో అన్నారు బాలయ్య. ఆ పెళ్లి విషయమేమిటి అని బాలయ్య అడగగానే రాసి పెట్టి లేదేమో సర్ అన్నాడు ప్రభాస్.. మీ అమ్మకి చెప్పిన కబుర్లు చెప్పక అన్నారు బాలయ్య.
ఇక ఛత్రపతి లో ఓ సీన్ ఎలా చేసానో చెప్పి ప్రభాస్ ఫన్ క్రియేట్ చేసాడు. తర్వాత గోపీచంద్ జాయిన్ అవ్వగానే ఏంటమ్మా 2008 లో ఓ హీరోయిన్ కోసం గొడవపడ్డారట అనగానే.. అది 2008 కాదు సర్ అని గోపీచంద్ అనగానే.. ప్రభాస్ వరే అంటూ గోపీచంద్ పైకి లేచాడు. ఇక ఈ స్టేజ్ పై ప్రభాస్ రామ్ చరణ్ కి కాల్ చెయ్యగా.. బాలయ్య మాట్లాడుతూ సంక్రాంతికి ముందు నా సినిమా చూసి, తర్వాత మీ నాన్న గారి సినిమా చూడు అంటూ ఆర్డర్ వెయ్యడం అందరిని ఆకట్టుకుంది. ప్రభాస్ అయితే పడి పడి నవ్వేసాడు.
రేపు ఆహా లో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ ఎపిసోడ్ పై అందరిలో క్యూరియాసిటీ పెరిగిపోతుంది.