బిగ్ బాస్ సీజన్ 4 లో క్రేజీగా ప్రేక్షక హృదయాలను గెలుచుకుని టాప్ 3 లోకి వెళ్లి నాగార్జున ఇచ్చిన 25 లక్షల సూట్ కేస్ అందుకుని విన్నర్ రేస్ నుండి తప్పుకున్న సోహెల్.. బయట బాగా ఫెమస్ అవడమే కాదు, అతను వెండితెర అవకాశాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం సోహెల్ నటించిన లక్కీ లక్ష్మణ్ రిలీజ్ కి రెడీ అయ్యింది. రేపు శుక్రవారం ఆడియన్స్ ముందుకు రాబోతున్న లక్కీ లక్షణ్ ప్రమోషన్స్ లో సోహెల్ తనని, తన ఫ్యామిలీ మెంబెర్స్ ని ట్రోల్ చేసిన వారికి గట్టి వార్నింగ్ ఇచ్చేసాడు.
లక్కీ లక్షణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సోహెల్ మట్లాడుతూ తాను బిగ్ బాస్ నుండి 25 లక్షల సూట్ కేస్ తీసుకుని స్కామ్ చేశాను అన్నారు. ఆ డబ్బులు మీ ఇంట్లో నుండి తీసుకుని వెళ్ళలేదు, మధ్యతరగతి వాళ్ళకి 25 లక్షలు అంటే 2 కోట్లతో సమానం. ఆ డబ్బు తో నా చెల్లి పెళ్లి చేశాను. ప్రజలు వేసిన ఓట్స్ వృధా పోలేదు, పెళ్లి చేసి మంచి పనే చేశాను. నాకు పదిమందికి సహాయం చెయ్యడమే తెలుసు, నన్ను ఎంతగా తిట్టినా, హేట్ చేసినా పర్లేదు, కానీ నా పేరెంట్స్ ని తిట్టిన వాళ్ళకి ఒక్కటే చెబుతున్నాను.
నా కొడకల్లారా.. మీ ఇంటికొచ్చి తరిమి తరిమి కొడతాను, సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరినైనా విమర్శించే హక్కు ఉంది, కానీ ఫ్యామిలీ జోలికి రావొద్దు, ఇంట్లో వాళ్ళని గలీజు బూతులు తిడితే మాత్రం వెతికి వెతికి కొడతాను అంటూ సోహెల్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు వైరల్ అవ్వగా.. అసలు సోహెల్ హీరో గా ఎంట్రీ ఇస్తున్న సమయంలో ఇలా రెచ్చిపోవడం కరెక్ట్ కాదేమో అనే అభిప్రాయాలూ నెటిజెన్స్ వ్యక్తం చేస్తున్నారు.