పవన్ కళ్యాణ్, బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోకి హాజరవుతున్నారని తెలియగానే వైసిపి గుండెల్లో రైళ్లు పరిగెత్తడం స్టార్ట్ చేసాయి. అందుకే పవన్ కళ్యాణ్ పై ఎడా పెడా అవాకులు చవాకులు పేల్చడం మొదలు పెట్టారు. ఇంకా ఒక అడుగు ముందుకు వేసి పవన్ కళ్యాణ్ బాలక్రిష్ణని తన పెళ్లిళ్ల విషయం షోలో ఎత్తొద్దని పర్సనల్ గా వీరసింహ రెడ్డి సెట్స్ లో కలిసి రిక్వెస్ట్ చేసారు.. లేదంటే ఎప్పుడూ బాలయ్యని కలవని పవన్ ప్రత్యేకంగా ఇప్పుడే ఎందుకు కలుస్తారు అంటూ ఏవేవో కథలు ప్రచారం చేసారు.
పవన్ కళ్యాణ్ తన పెళ్లిళ్ల విషయం మాట్లాడడానికి భయపడతాడు అంటూ ఏవేవో కథలు అల్లారు. కానీ ఈ దారుణమైన ప్రచారానికి పవన్ కళ్యాణ్ దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చేసారు. నిన్న మంగళవారం ఉదయం 11 గంటలకు అన్నపూర్ణ స్టూడియోస్ లో పవన్ కళ్యాణ్ తో బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షో మొదలు పెడితే.. సాయంత్రం ఆరు గంటల వరకు ఈ ఎపిసోడ్ షూట్ జరిగినా.. పవన్ కళ్యాణ్ ఓపిగ్గా అక్కడే ఉండి.. బాలయ్య తో కలిసి లంచ్ కూడా చేసినట్లుగా తెలుస్తుంది. దాదాపు ఆరు గంటల పాటు బాలయ్య తో పవన్ కళ్యాణ్ షో సాగగా.. మధ్యలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంటర్ అయ్యి ఈ షోని మరింతగా రక్తి కట్టించారని తెలుస్తుంది, పవన్ కళ్యాణ్ తన మూడు పెళ్ళిళ్ల విషయంలో ప్రేక్షకులకి ప్రజలకి ఈ షో ద్వారా ఫుల్ క్లారిటీ ఇచ్చెయ్యగా.. బాలయ్య కూడా పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసే వారిపై ఘాటైన కామెంట్స్ చేసినట్లుగా తెలుస్తుంది.
సో పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల మేటర్ తమకి బలమవుతుంది, పవన్ కళ్యాణ్ ని ఇరికేంచేద్దామనుకున్న వైసిపికి, వైసిపి అనుకూల మీడియాకి ఇప్పుడు బాలయ్య-పవన్ షోలో ఏం జరిగిందో తెలిసి నోటమాట రాక తెల్లమొహం వేస్తున్నారని వినికిడి.