Advertisement
Google Ads BL

పవన్ పెళ్ళిళ్ళపై అన్ స్టాపబుల్ లో ఫుల్ క్లారిటీ


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షోకి హాజరై మైండ్ బ్లాంక్ చేసారు. పవన్ అసలు టాక్ షోస్ కి హాజరు కారు. ఆయనకి చాలా సిగ్గు, బిడియం, మొహమాటం. కానీ మొదటిసారి ఆహా టాక్ కోసం పవన్ కదిలారు. బాలయ్య వ్యాఖ్యాతగా జరిగిన పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ షూట్ రోజున అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏం జరిగిందో అందరూ చూసారు. ఏం క్రేజు, ఏం క్రేజు, పవన్ కళ్యాణ్-బాలకృష్ణ కలిస్తే ఇలా ఉంటుందా అని చూపించారు. ఇక టాక్ షోలో పవన్ కళ్యాణ్ పొలిటికల్ లుక్ లో కనిపిస్తారనుకుంటే.. సినిమాటిక్ లుక్ లో స్టైలిష్ గా కనిపించి ఫాన్స్ కి కనువిందు చేసారు.

Advertisement
CJ Advs

ఇక స్టేజ్ పై పవన్ కళ్యాణ్ ని పెళ్లిళ్ల విషయం అడక్కుండా బాలయ్య దగ్గర పవన్ మాట తీసుకున్నాడని, అసలు ఈ పెళ్లిళ్ల మేటర్ బయటికి తియ్యరనే అనే ప్రచారం జరిగింది. బాలయ్య ఈ అన్ స్టాపబుల్ షోలో చాలామంది స్టార్స్ పర్సనల్ లైఫ్ ని రివీల్ చేసారు. ఇప్పుడు కూడా బాలకృష్ణ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల విషయంపై పవన్ ని ఓపెన్ గా అడిగినట్లుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంలో దాపరికం లేకుండా ఓపెన్ అయ్యారని తెలుస్తుంది. ఎక్కడా తన పర్సనల్ విషయాలను బయటపెట్టని పవన్ కళ్యాణ్ ఈ షో ద్వారా ఏపీ ప్రజలకి క్లారిటీ ఇవ్వడానికే ఈ షోకి హాజరైనట్టుగా తెలుస్తుంది.

పవన్ కళ్యాణ్ చెప్పిన సమాధానం విన్న బాలయ్య కూడా కళ్యాణ్ ఇంత ఓపెన్ అయ్యాక, క్లియర్ చేసాక కూడా కళ్యాణ్ ని పర్సనల్ గా టార్గెట్ చేస్తే నిజంగా వాళ్ళు ఊరకుక్కలతో సమానమని కామెంట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఏదైనా పవన్-బాలయ్య ఎపిసోడ్ పై ఏపీ ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ జనసేనకు ఈ ఎపిసోడ్ ఎంతో కొంత బూస్ట్ ఇవ్వడం కూడా పక్కా అని జన సైనికులు కూడా నమ్ముతున్నారు.

Pawan Kalyan said in unstoppable show about having 3 marriages:

Pawan Kalyan in Balakrishna Unstoppable 2
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs