Advertisement
Google Ads BL

సొంతఇంటి కల నెరవేరింది అంటున్న పూజ


ఈ ఏడాది పూజ హెగ్డే కి షాక్ ల మీద షాక్ లు తగిలినా ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ పూజ హెగ్డే చేతిలో ఉన్నాయి. అంతేకాకుండా తన చిన్ననాటి కలని ఈ ఏడాది పూర్తి చేసింది పూజ. చిన్నప్పటినుండి అన్ని హంగులతో ముంబైలో ఇల్లు కొనుక్కోవాలని పూజ హెగ్డే అనుకునేదట. అలా ఈ ఏడాది పూజ హెగ్డే ముంబైలో ఇల్లు కొనుక్కుని అది తన అభిరుచికి తగ్గట్టుగా డిజైన్ చేయించుకున్నట్టుగా చెబుతుంది.  

Advertisement
CJ Advs

మనల్ని మనలా ఉంచేది మన సొంత ఇల్లే, షూటింగ్స్ లో అలిసిపోయి, ఉద్రేకంతో ఇంటికి వస్తే.. సొంత ఇల్లయితే ఆ హాయే వేరు, సొంత ఇంట్లో ఉంటే ఆ ఫీలింగ్ వేరు, అందుకే దానికి తగ్గట్టుగా తన ఇంటిని అమర్చుకున్నాను అని, ఎవరి ఇంట్లో అయినా ఏ వస్తువును అయినా మనకు తగ్గట్టుగా మార్చుకోవాలి, అప్పుడే మనసు నిండిపోతుంది. అలాగే తానొక నటిని కాబట్టి బెడ్ రూమ్ లో ఓ ప్రొజెక్టర్ ఏర్పాటు చేసుకుని, హాల్, కిచెన్ అన్ని తన అభిరుచికి తగ్గట్టుగా చేయించుకున్నట్లుగా పూజ హెగ్డే తెలిపింది,.

ఇక పూజ హెగ్డే కి 2022 కలిసి రాకపోయినా.. ఆమె హోప్స్ అన్ని 2023 పైనే ఉన్నాయి. SSMB28 తో పాటుగా సల్మాన్ ఖాన్ ప్రాజెక్ట్, అలాగే బాలీవుడ్ లో మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో పూజ హెగ్డే పేరు బాగా వినిపిస్తుంది. అవి కూడా ఓకె అయితే ఆమె హిందీలో కుదురుకున్నట్టే.

Own House, Dream Come True· Pooja Hegde:

Pooja Hegde says that the dream of owning a house has come true
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs