ఈఏడాది కుర్ర హీరో ఆది సాయి కుమార్ ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఫైట్ చేస్తున్నాడు. 2022 ఏడాది ఆరంభంలో అతిథి దేవో భవ తో హడావిడి చేసాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఆ సినిమా ప్లాప్ ని అంటగట్టింది. ఏడాది ఆరంభంలోనే డిసాస్టర్ చవి చూసిన ఆది సాయి కుమార్ ఈ ఏడాది ఇంకా రెండు మూడు సినిమాలతో హిట్ కొడదామని వచ్చాడు. కానీ ఆడియన్స్ ఆది సాయి కుమార్ ని లైట్ తీసుకున్నారు. తీస్ మార్ ఖాన్ డైరెక్ట్ ఓటిటీలలో రిలీజ్ చేసినా ఆదికి హిట్ తగల్లేదు. క్రేజీ ఫెలో అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది.
ఇక ఇయర్ స్టార్టింగ్ లో డిసాస్టర్ పడినా, మిడిల్ లో ప్లాప్ లు వచ్చినా 2022 ఇయర్ ఎండ్ లో మాత్రం గట్టి హోప్స్ పెట్టుకున్నాడు. అదే రేపు శుక్రవారం ఇయర్ ఎండ్ చివరి వారంలో రిలీజ్ కి రెడీ అయిన టాప్ గేర్. టాప్ గేర్ ట్రైలర్, పోస్టర్స్ చూస్తుంటే హిట్ కళ కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. గతంలో ఆది సాయి కుమార్ సినిమాలు వస్తున్నాయంటే అటు పబ్లిసిటీ కరువయ్యేది. ఇటు ఆడియన్స్ పట్టించుకునేవారు కాదు. కానీ ఈసారి టాప్ గేర్ ప్రమోషన్స్ పరుగులు పెడుతున్నాయి.
ఈ సినిమాపై ఆది సాయి కుమార్ హోప్స్ పెట్టుకున్నాడు. మాస్ స్టయిల్లో దర్శనం ఇవ్వబోతున్న ఆది సాయి కుమార్ లుక్స్, హీరోయిన్ తో రొమాంటిక్ యాంగిల్ అన్ని బాగా కనబడుతున్నాయి. ఇటు ప్రమోషన్స్ పరంగాను మేకర్స్ సందడి చేస్తున్నారు. మరి ఇయర్ ఎండ్ లో టాప్ గేర్ తో ఆది హిట్ కొట్టి తనకి తాను సక్సెస్ ఇచ్చుకుని, ఇండస్ట్రీ కి ఊపు తెస్తాడేమో చూడాలి.