Advertisement
Google Ads BL

అభిమానులకి యాంకర్ సుమ షాకింగ్ న్యూస్


సుమా కనకాల యాంకరింగ్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసి.. స్టార్ హీరోల దగ్గరనుండి చిన్న సెలెబ్రిటీస్ వరకు తనకి అభిమానులుగా మార్చుకుని, అభిమానులని అంతకన్నా ఎక్కువ రేంజ్ లో సంపాదించుకుని టాలీవుడ్ లో పాతుకుపోయి.. 40 ప్లస్ లోను ఇప్పటికి కొత్త యాంకర్లకి పోటీనిచ్చే ఆమె మలయాళీ అమ్మాయి. అయినప్పటికీ అచ్చ తెలుగు అమ్మాయిలా అనర్గళంగా మట్లాడుతూ అందరిని నవ్వించి కవ్వించి, సెటైర్స్ వేస్తూ ఉడికించి, ఇరుకున పెట్టే సుమ కనకాల యాంకరింగ్ కి గుడ్ బై చెప్పెయ్యబోతుందా?

Advertisement
CJ Advs

ఇప్పడు అదే సినిమా ఇండస్ట్రీలో మెయిన్ టాపిక్ అయ్యింది. హీరోయిన్స్ సినిమాలకు గుడ్ బై చెప్పేస్తామంటే అభిమానులు గుండెలు బద్దలైనట్టుగా తెలుగు రాష్ట్రాల మహిళలు సుమ యాంకరింగ్ నుండి కాస్త బ్రేక్ తీసుకోబోతుంది అనే న్యూస్ చూసి విలవిల్లాడిపోతున్నారు. సుమ బుల్లితెర మహారాణి, ఆమె లేకపోతే క్యాష్, ఆడియో ఫంక్షన్స్, ప్రీ రిలీజ్ వేడుకలు, ఇంటర్వూస్, స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏమైపోతాయని వారు బాధపడిపోతున్నారు.

అసలు విషయం ఏమిటి అంటే సుమ కనకాల ఈటీవీలో న్యూ ఇయర్ కోసం చేసిన ద పార్టీ షో కి అతిధిగా వచ్చి ఈ యాంకరింగ్ కి కొంత గ్యాప్ తీసుకోబోతున్నట్లుగా చెప్పింది. నేను మలయాళీ అమ్మాయిని అయినా 15 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకుల్లో గుండెల్లో పెట్టుకుని ప్రేమించారంటూ సుమ కనకాల కన్నీళ్ళు పెట్టుకోవడం చూసి మహిళలు ఫీలైపోతున్నారు. ఇక సుమకి అదే స్టేజ్ పై సన్మానం చెయ్యడం కూడా వైరల్ అయ్యింది. మరి సుమ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందో కానీ.. ఆమె ఫాన్స్ మాత్రం బాధలో మునిగిపోయారు.

Suma Kanakala Reveals She Says Goodbye To Anchoring :

Suma Kanakala Reveals She Says Goodbye To Anchoring In New Year Special Event Where Is The Party Show.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs