Advertisement
Google Ads BL

చిన్న కుమార్తెతో కలిసి ఆహా షోకి బాలయ్య


ప్రస్తుతం బాలకృష్ణ స్టయిల్, ఆయన హెయిర్ స్టయిల్ అన్నిటికి ఫాన్స్ ముగ్దులవ్వడానికి ప్రత్యేక కారణం బాలకృష్ణ చిన్న కుమర్తె తేజస్వినినే. బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో లో ఆయన అందంగా స్టయిల్ గా కనిపించడానికి ఆమె కారణమట. ఈ విషయం అన్ స్టాపబుల్ సీజన్ వన్ అప్పుడు ఆహా టాక్ షోకి డైలాగ్స్ అందించే మచ్చ రవివి కొన్ని ఛానల్స్ ఇంటర్వ్యూలలో చెప్పాడు. అయితే ఈ రోజు మంగళవారం బాలకృష్ణ పవన్ కళ్యాణ్ తో అన్ స్టాపబుల్ ఎపిసోడ్ చెయ్యడానికి అన్నపూర్ణ స్టూడియోస్ కి వచ్చారు.

Advertisement
CJ Advs

బాలయ్య తో పాటుగా ఆయన చిన్న కుమర్తె తేజస్విని రావడం అక్కడ హైలెట్ అయ్యింది. బాలకృష్ణ-అల్లు అరవింద్ పవన్ కోసం వెయిట్ చేస్తూ ముచ్చట్లు పెట్టిన సమయంలో తేజస్విని అక్కడే కూర్చుని వారి మాటలు వింటూ నవ్వుతూ ఉంది. అక్కడ బాలయ్య పక్కనే తేజస్వినిని చూసిన నందమూరి ఫాన్స్ ముచ్చటపడిపోయారు. ఇక ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో అన్ స్టాపబుల్ షో జరిగే ప్రాంతమంతా జై బాలయ్య, జై జై బాలయ్య, NBK విత్ PSPK స్లొగన్స్, సీఎం పవన్ అంటూ పవన్ ఫాన్స్ రచ్చ మాములుగా లేదు.

అన్నపూర్ణ స్టూడియోస్ లో ఇసుక వేస్తె రాలనంత జనం, పవన్ వచ్చినప్పుడు చూడాలి.. అక్కడ అభిమానుల కోలాహలం, జై పవన్, సీఎం పవన్ అంటూ వాళ్ళు అరిచే అరుపులకి చెవులు చిల్లులు పడిపోతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ కి ఎదురు వెళ్లి అరవింద్ రిసీవ్ చేసుకోగా.. తర్వాత బాలయ్య పవన్ కళ్యాణ్ ని ఆలింగనం చేసుకుని ఈ షో కి ఆహ్వానించడంతో అభిమానులు ఆగలేక అరుపులు కేకలతో అక్కడ రచ్చ రచ్చ చేసారు.

Balayya in Unstoppable with his younger daughter Tejaswini:

UNSTOPPABLE - NBK x PSPK
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs