Advertisement
Google Ads BL

క్రేజీగా బిగ్ బాస్ సోహెల్ లక్కీ లక్ష్మణ్


బిగ్ బాస్ గత సీజన్ 4 లో టాప్ 3 లో ఉండి నాగార్జున ఆఫర్ చేసిన 25 లక్షల సూట్ కేస్ అందుకని.. బిగ్ బాస్ హౌస్ లో మటన్ మటన్ చికెన్ చికెన్ స్లొగన్స్ తో, హైపర్ యాక్టీవ్ గా కనిపించి మెగాస్టార్ చిరు ఆయన భార్య సురేఖ దృష్టిలో పడి.. మెగాస్టార్ ఇంటి నుండి బిర్యానీ వచ్చేలా చేసిన సోహెల్.. ఇప్పుడు లక్కీ లక్షణ్ తో క్రేజీగా ప్రేక్షకుల ముందు రాబోతున్నాడు. బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక ఇంటర్వూస్ తో హడావిడి చేసి సిల్వర్ స్క్రీన్ మీద హీరో గా అరంగేట్రానికి రెడీ అయ్యాడు. లక్కీ లక్షణ్ ఆఫర్ తో సోహెల్ సినిమా చేసేసి.. రేపు శుక్రవారం ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.

Advertisement
CJ Advs

లక్కీ లక్షణ్ ప్రమోషన్స్ లో హైపర్ యాక్టీవ్ గా పాల్గొంటున్నాడు. లక్కీ లక్షణ్ టీం తో కలిసి నానా హంగామా చేస్తూ సినిమాని ఆడియన్స్ లోకి తీసుకువెళుతున్నాడు. రీసెంట్ గా దర్శకుడు, బిగ్ బాస్ షాని తో కలిసి కడప దర్గాని సందర్శించాడు సోహెల్. టీం తో కలిసి ఈ సినిమా కోసం సోహెల్ చాలా కష్టపడుతున్నాడు. సోహెల్ ఫ్రెండ్ అఖిల్ సార్థక్ కూడా సినిమా, వెబ్ సీరీస్ ఒకటి మొదలు పెట్టినా అతని కన్నా ముందు, అలాగే విన్నర్ అభిజిత్ కన్నా సోహెల్ బాగా బిజీ అయ్యాడు. ఎనర్జిటిక్ గా అవకాశాలతో దూసుకుపోతున్న సోహెల్ కి ఈ లక్కీ లక్షణ్ హిట్ ఇవ్వడం పక్కా అంటున్నారు ఆయన అభిమానులు. 

లక్కీ లక్ష్మణ్ తో హిట్ కొట్టి మరిన్ని అవకాశాలు పట్టేసి సోహెల్ ఇండస్ట్రీలో మంచి పొజిషన్ కి రావాలని అభిమానులతో పాటుగా మనము కోరుకుందాం.

Bigg Boss Sohel Lucky Laxman:

Bigg Boss Sohel Mass Craze in Lucky Lakshman promotions
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs