అన్ స్టాపబుల్ సీజన్ 2 గ్రాండ్ గా మొదలైనా.. క్రేజీ హీరోలు, క్రేజీ కాంబినేషన్స్ కరువయ్యి వారం వారం రావాల్సిన ఎపిసోడ్స్ కి మధ్యలో స్పీడు బ్రేకర్లు వేసి మరీ చప్పగా తయారు చేసారు ఆహా వారు. సీజన్ వన్ ని క్రేజీగా రక్తి కట్టించిన అన్ స్టాపబుల్ మేకర్స్ సీజన్ 2 ని అంతగా జనాల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారు. సీజన్ 2 లో ఇప్పటివరకు పొలిటికల్ ఎపిసోడ్స్ కనిపించాయి. ఇప్పుడు ప్రభాస్ తో ఓ అదిరిపోయే ఎపిసోడ్ రేపు 30 న శుక్రవారం రాబోతుంది. ఆ ఎపిసోడ్ కోసం అందరూ వెయిట్ చేసేలా చేసారు అరవింద్ వాళ్ళు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో బాలయ్య అన్ స్టాపబుల్ ఎపిసోడ్ కి ముహూర్తం కుదిరింది. పవన్ కళ్యాణ్-బాలకృష్ణ ల సూపర్ ఎపిసోడ్ ని సంక్రాతి ఫెస్టివల్ సందర్భంగా స్ట్రీమింగ్ చేస్తారు. మధ్యలో ప్రోమోస్, గ్లిమ్ప్స్ అంటూ ఆడియన్స్ లో ఆత్రుత పెంచే ప్లాన్ చేస్తున్నారు. అన్ స్టాపబునుల్ సిజన్ 2 లో ఈ రెండు ఎపిసోడ్స్ మాత్రం భారీ అంచనాలతో, హైప్ క్రియేట్ అయిన ఎపిసోడ్స్ గా కనిపిస్తున్నాయి. ప్రోమోస్ తోనే ఆసక్తిని కలిగించిన బాహుబలి ఎపిసోడ్ కోసం అభిమానులు రోజులు, గంటలు, నిముషాలు లెక్కబెడుతూ గడుపుతున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కోసం మరెంతగా ఎదురు చూస్తారో.. రేపు షూట్ ఫినిష్ అయ్యి గ్లిమ్ప్స్ రూపం లో బయటికి వచ్చే కంటెంట్ డిసైడ్ చేస్తుంది.