Advertisement
Google Ads BL

డైరెక్టర్ ట్వీట్, సమంత రిప్లై


డైరెక్టర్ కమ్ నటుడు రాహుల్ రవీంద్రన్ భార్య చిన్మయి టాప్ హీరోయిన్ సమంత మంచి ఫ్రెండ్స్. సమంతకి చిన్మయి డబ్బింగ్ చెప్పడమే కాదు, వీరిద్దరూ ఫ్రెండ్లిగా మూవ్ అవడంతో రాహుల్ రవీంద్ర కూడా సమంత కి ఫ్రెండ్ అయ్యాడు. తాజాగా ఈ క్రిస్టమస్ కి రాహుల్ రవీంద్రన్ సమంత కి క్రిస్టమస్ శుభాకాంక్షలు చెబుతూ ఓ పిక్ ని ట్వీట్ చేసాడు. ప్రస్తుతం సమంత మాయోసైటిస్ తో బాధపడుతుంది. కండరాల బలహీనత, నీరసం వంటి లక్షణాలతో సమంత ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటుంది. అందుకే సమంత హెల్త్ ని ఉద్దేశించి రాహుల్.. ప్రస్తుతం నీ దారి డార్క్ గా ఉండొచ్చు, త్వరలోనే అది వెలిగిపోతూ ప్రకాశిస్తుంది, నీ శరీరంలో కదలికలు ప్రస్తుతం కష్టంగా ఉండొచ్చు.

Advertisement
CJ Advs

కానీ త్వరలోనే అన్నీ బాగవుతాయి. నువ్వు ఐరన్ లేడీ వి. సక్సెస్ నీ జన్మ హక్కు, నువ్వు పోరాటాలు చేసే యోధురాలివి. నిన్ను ఏ వ్యాధి ఓడించలేదు, ఇలాంటివి నిన్ను ఇంకా స్ట్రాంగ్ గా నిలబెడతాయి.. అంటూ రాహుల్ షేర్ చేసిన పిక్ లో ఉంది.

దానికి సమంత రిప్లై ఇస్తూ.. కఠినమైన పోరాటాలు చేస్తున్న వారికి ఇది అంకితం.. అంటూ రాహుల్ షేర్ చేసిన పిక్ ని రీ ట్వీట్ చేసింది. అంతేకాకుండా పోరాడుతూనే ఉంటే గతంలో కంటే బలంగా తయారవుతారని అంటూ సమంత తన ట్వీట్ లో రాహుల్ కి రిప్లై ఇవ్వడంతో ఆ ట్వీట్ నిమిషాల్లో వైరల్ అయ్యింది. మరి సమంత హెల్త్ ఎంతగా సహకరించకపోతే ఆమె క్రిష్టమస్ సెలెబ్రేషన్స్ కి దూరంగా ఉంటుందో అని ఆమె అభిమానులు కూడా ఫీలవుతున్నారు.

Director Tweet, Samantha reply:

Rahul Ravindran gifts Samantha Ruth Prabhu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs