కింగ్ నాగార్జున కి ఏదో సెంటిమెంట్ ఉన్నట్టుగా ఉంది. లేకపోతే ఎంతో ఆప్తులైన సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు చనిపోతే నాగార్జున మాత్రం వాళ్ళకి నివాళులు అర్పించడానికి కానీ, కుటుంబ సభ్యుల పరామర్శకి కానీ రావడం లేదు. ఎంత షూటింగ్స్ తో బిజీగా వున్నా చిరు, బాలయ్య లాంటి వాళ్ళు వెళుతున్నారు కానీ.. నాగార్జున మాత్రం చాలా తక్కువ కనిపిస్తున్నారు. రీసెంట్ గా కృష్ణం రాజు, కృష్ణ గారు, కైకాల సత్యనారాయన, చలపతి రావు మరణాలతో ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోగా.. చిరు, బాలయ్య, వెంకీ ఇలా అందరూ వెళ్లి వారి కుటుంబాలని ఓదారుస్తున్నారు.
మొన్ననే కైకాల సత్యన్నారాయణ మృతి చెందిన సందర్భములో సైతం కనిపించని నాగార్జున నేడు తనకెంతో సన్నహితుడైన చలపతిరావు భౌతిక కాయం సందర్శనకు కూడా రాకపోవడం ఈ చర్చకు దారి తీసింది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నాగార్జున నటించి నిర్మించిన నిన్నే పెళ్లాడతా ఎంతటి ఘన విజయం సాధించిందో ఆ చిత్రంలో నాగార్జునకి తండ్రిగా చలపతి రావు సరికొత్త తీరులో కనిపించిన విధానం కూడా అంతే తీరులో గుర్తుండిపోయింది. అందుకే నేడు నాగార్జున రాకని ఆశించిన సినీ జనం ఇప్పుడు కూడా నాగార్జున కదలకపోవడం పట్ల వివిధ వ్యాఖ్యలు చేస్తున్నారు. బహుశా ఈ విషయంలో నాగార్జునకి ఏదైనా సెంటిమెంట్ ఉంది ఉండాలి, లేదా.. మరో ప్రత్యేక కారణమేదైనా కలిగి ఉండాలి.
నెక్స్ట్ టైం నాగార్జున మీడియా ముందుకు వచ్చినప్పుడు మాత్రం పాత్రికేయుల వద్ద నుంచి తప్పకుండా ఈ ప్రశ్నను ఎదుర్కోవాల్సి రావొచ్చు. మరి అప్పుడు ఆయన చెప్పే సమాధానం ఏమిటో.. వివరించే కారణమేమిటో అనేది వేచి చూద్దాం.