Advertisement
Google Ads BL

ప్రియుడికి రకుల్ ప్రీత్ బర్త్ డే విషెస్


హీరోయిన్ రకుల్ ప్రీత్ సోషల్ మీడియాలో బిజీగా వుండే నటి. సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటో షూట్స్ ని షేర్ చేసే రకుల్ ప్రీత్ ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. దేనికి అంటే ఈడీ నోటీసు లు అందుకోవడంతో అందరి చూపు రకుల్ మీదే పడింది. కానీ రకుల్ కార్యాలయం తమకి ఎలాటి ఈడీ నోటీసులు అందలేదని వాదిస్తుంది. ఈ విషయమై ఈడీ నుండి పూర్తి సమాచారం అందాల్సి ఉంది. అయితే తెలుగు చిత్రాల్లో గత రెండు మూడేళ్ళుగా పెద్దగా కనిపించని రకుల్ బాలీవుడ్ చిత్రాలలో బాగానే కనిపిస్తుంది.

Advertisement
CJ Advs

అక్కడ కూడా రకుల్ కి ఎదురు గాలే. ఒక్క సినిమా కూడా హిట్ అయిన దాఖలాలు లేవు. ఇక ఇప్పుడు తమిళంలో ఇండియన్ 2 లో కాజల్ అగర్వాల్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. అదలా ఉంటే ప్రస్తుతం బాలీవుడ్ లో హీరో కమ్ నిర్మాత ప్రేమలో రకుల్ మునిగి తెలుస్తుంది. జాక్ భగ్నానీ తో రకుల్ పీకల్లోతు ప్రేమలో ఉంది. అందుకే పెళ్ళెప్పుడు అని తరచూ అడిగే ప్రశ్నలకి రకుల్ ఓపిగ్గా సమాధానం ఇవ్వడం మానేసి ఫైర్ అవుతుంటుంది.

ఈ రోజు క్రిష్ట్మస్ దానితో పాటుగా రకుల్ ప్రియుడు జాకీ భగ్నానీ పుట్టిన రోజు కావడంతో రకుల్ సోషల్ మీడియాలో జాకీ తో క్లోజ్ గా ఉన్న పిక్ ని షేర్ చేస్తూ ఈ శాంతా నాకు అద్భుతమైన బహుమతినిచ్చింది అది నువ్వే . నా ప్రేమ, జీవితం సంతోషంగా ఆనందంగా మారడానికి కారణం నువ్వే. నువ్వు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. హ్యాపీ బర్త్ డే మై లవ్ ఆంటూ రకుల్ జాకీకి చెప్పిన బర్త్ డే విషెస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

Rakul cute birthday wishes for Jakhi Bhagnani:

Rakul cute birthday wishes for boy friend Jakhi Bhagnani
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs