Advertisement
Google Ads BL

మారుతి మూవీలో ప్రభాస్ లుక్


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మారుతి దర్శకత్వం వహిస్తున్న చిత్రం గుట్టు చప్పుడు కాకుండా తెరకెక్కుతుంది. పూజా కార్యక్రమాల విషయం కానీ, షూటింగ్ షెడ్యూల్స్ విషయం కానీ, ఈ సినిమాలో ప్రభాస్ సరసన నటించబోయే హీరోయిన్స్ విషయం కానీ.. గాలికి కొట్టుకొచ్చే వార్తలు తప్ప మేకర్స్ అఫీషియల్ గా ఇంతవరకు ఈ ప్రాజెక్ట్ ని ప్రకటించలేదు. మారుతి ప్రభాస్ తో సినిమా చెయ్యడం ఇష్టం లేని ప్రభాస్ ఫాన్స్ ట్రోల్ చెయ్యడం స్టార్ట్ చేసారు, ఈ ఎనెగెటివిటీని తట్టుకోలేక మేకర్స్ అప్ డేట్స్ ఇవ్వకుండా షూటింగ్ చేసుకుంటున్నారు. మారుతి ప్రస్తుతం డిసాస్టర్ తీసి ఉండడంతో ప్రభాస్ ఫాన్స్ కలవర పడుతున్నారు.

Advertisement
CJ Advs

పాన్ ఇండియా మూవీస్ మధ్యలో చిన్న చిత్రం అవసరమా.. అందులో ప్రభాస్ కి ఏమి నచ్చింది సామి అంటూ గోల పెడుతున్నా ప్రభాస్ లెక్క చెయ్యకుండా సినిమా షూట్ లో జాయిన్ అయ్యాడు. సలార్, ప్రాజెక్ట్ K మధ్యలో మారుతి మూవీ అన్నట్టుగా ప్రభాస్ బిజీ బిజీగా హడావిడి చేస్తున్నాడు. తాజాగా ప్రభాస్-మారుతీ కాంబో మూవీ సెట్స్ నుండి ఓ పిక్ లీకైంది. ప్రభాస్ చైర్ లో రిలాక్స్ గా కూర్చుని మారుతి తో ముచ్చటిస్తున్న పిక్ అది. దానితో ప్రభాస్ ఫాన్స్ ఆయన లుక్ పై ఆనందపడాలో, ఆందోళన పడాలో అర్ధం కావడం లేదు అంటున్నారు. 

ప్రభాస్ ఆ లీకెడ్ పిక్ లో కాస్త ఫరెంట్ గా కనబడుతున్నాడు. మారుతి తో మాట్లాడుతున్న ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాదు మారుతి ప్రభాస్ ని ఇలానే చూప్పించబోతున్నాడంటూ ఫిక్స్ అవుతున్నారు కూడా.

Prabhas look from Maruthi Movie:

Prabhas on Fire in Maruthi Shoot
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs